సిద్దిపేట-దుబ్బాక రెండు కళ్లు: హరీష్ రావు

400
harishrao
- Advertisement -

సిద్దిపేట,దుబ్బాక తనకు రెండు కళ్లు అని తెలిపారు మంత్రి హరీష్ రావు. దుబ్బాక నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపన చేసిన అనంతరం మాట్లాడిన హరీష్…త్వరలోనే ప్రతి ఎకరాకు సాగునీరు అందించి శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు.

దుబ్బాక ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని…. దుబ్బాక అభివృద్ధి బాధ్యత నేనే తీసుకుంటానని స్పష్టం చేశారు.సిద్దిపేట తరహాలో దుబ్బాకను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు.

దుబ్బాకలో మహిళల తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపామని….లక్షా 35వేల ఎకరాలకు సాగునీరు అందించి చూపిస్తామన్నారు. దుబ్బాక అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ రూ. 35 కోట్ల ప్యాకేజీ ఇచ్చారని గుర్తుచేశారు.

- Advertisement -