త్వరలో 50 వేల ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు వెల్లడించారు మంత్రి హరీశ్ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో మోడల్ జిల్లా గ్రంధాలయ భవనాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన హరీశ్…తెలంగాణా వచ్చాక లక్షా 30వేల ఉద్యోగాలు భర్తి చేశామని వెల్లడించారు.
డిజిటల్ లైబ్రరీలో మొత్తం 13 కంప్యూటర్లు ఉన్నాయని, ఉచిత ఇంటర్నెట్తో వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దీనిని నేషనల్ డిజిటల్ లైబ్రరీకి లింక్ చేశామని చెప్పారు. జాతీయ స్ధాయిలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఈ మోడల్ జిల్లా గ్రంథాలయం బాగా ఉపకరిస్తుందన్నారు.
అన్ని రకాల బుక్స్, లైవ్ విజువల్స్, ఇంటర్ నేషనల్ జర్నల్స్ అందుబాటులో ఉంటాయన్నారు. విజ్ఞానం మనిషికి తరగని నిధి.. ఎంత విజ్ఞానం సంపాదిస్తే అంతగా మనిషి ఎదుగుదల ఉంటుందన్నారు. విద్యార్థులు తమకు కావాల్సిన పుస్తకాలు ఏంటో సజేషన్ ఇస్తే వాటిని కచ్చితంగా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.