విద్యుత్‌ కోత‌ లేని రాష్ట్రం తెలంగాణ: హరీశ్‌ రావు

59
medak

మెదక్ జిల్లా చిన్న శంకంర పేట్‌లో 12 కోట్ల 38 లక్షల 50 వేలతో 132/33 kV ‌ సబ్ స్టేషన్ ను ప్రారంభించారు ఆర్థిక మంత్రి హరీశ్ రావు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్‌ రావు..తెలంగాణ వస్తే అంతా చీకటని ఆరోజు అన్నారు…తెలంగాణ వస్తే ఏమోస్తదన్నారు….వారంలో పరిశ్రమలకు నాలుగు రోజులు ఆనాడు పవర్ హలిడే అన్నారు.

మోటర్లు, ట్రాన్స్ ఫార్మర్ కాలకుండా పంటలు పండేవి కావు….రైతులకు 24 గంటల కరెంటు ఉచితంగా ఇచ్చే రాష్ట్రంలో‌ దేశంలో ఎక్కడాలేదన్నారు. చంద్రబాబు హయాంలో రైతులపై కాల్పులు జరిపారు బిల్లులు తగ్గించమంటే…కాంగ్రెస్ హయాంలో కరెంటు కోతలే…ఏ రాష్ట్రానికి‌ వెళదాం. ఎక్కడ ఉచితంగా రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నారని ప్రశ్నించారు.

చేతల మనుషులు కావాలా…. మాటల. మనుషులు కావాలా అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక ఆరేళ్లలో 33/11kv సబ్ స్టేషన్లు‌ వేయి నిర్మించాం…అత్యధిక తలసరి విద్యుత్ వినియోగం చేస్తోన్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. బీజేపీ పాలిత‌ రాష్ట్రాలు పదహారు ఉన్నాయి…అక్కడ ఎందుకు లేదు..ఇలా అని ప్రశ్నించారు.కనురెప్ప పాటు కూడా విద్యుత్‌ కోత‌ లేని రాష్ట్రం తెలంగాణ….70 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో గ్రామాలను విడిచి ప్రజలు వలస‌ వెళ్లారని గుర్తుచేశారు.తెలంగాణ ఎవరు తెచ్చారో ఆలోచించాలి. రాజీనామాలు చేయ మంటే పారిపోయిన వాళ్లు ఇప్పుడు పెద్దగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు హరీశ్‌ రావు.తెలంగాణ వచ్చినప్పుడు 7778 మెగావాట్లు డిమాండ్ ఉంది. ఇప్పుడు అది 16,249 మెగావాట్లు ఉందన్నారు.