ఆర్టీసీని కాపాడుకోవాలి: హరీశ్ రావు

178
siddipet Model Busstand
- Advertisement -

సిద్దిపేట జిల్లా కేంద్రమైన నూతనంగా నిర్మించిన మోడల్ బస్ స్టేషన్‌ను ప్రారంభించారు మంత్రి హరీశ్‌ రావు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్‌… 50 ఏళ్ల నాటి బస్టాండు. ఆనాటి చొక్కారావు మంత్రి 1974-75లో శంకుస్థాపన చేశారని, అర్థ శతాబ్దం కాలంగా సేవలు అందించినట్లు వెల్లడించారు. ఆ రోజుల్లో పదుల సంఖ్యలో బస్సులు. వందల సంఖ్యలో ప్రజలు. ఇవాళ వందల సంఖ్యలో బస్సులు వేలాది మంది ప్రయాణీకులు పెరిగారన్నారు. సీఎస్ఆర్ నిధులతో ఈ బస్టాండ్ నిర్మించాం. సీఎస్ఆర్ నిధుల నుంచి నిర్మించి ఆర్టీసీ-ప్రభుత్వానికి అప్పగించాం అన్నారు.

ఆర్టీసీని మనం కాపాడుకోవాలి. దురదృష్టం ఏమిటంటే.. కేంద్ర ప్రభుత్వం అన్నీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెడుతుంది. రైలు, ఏల్ఐసీ, బస్టాండులు, విమానాశ్రయాలు, ఇతరత్రా ప్రభుత్వ రంగ సంస్థలు.. విక్రయిస్తే.. బహుమానం ఇస్తామని డబుల్ ఇంజన్ ప్రభుత్వం అమ్మకానికి పెడుతుందన్నారు. కానీ ఆర్టీసీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతున్నది. ఆర్టీసీ సంస్థ ఎంతో మంది కార్మికులు, లక్షల, కోట్లాది ప్రజల జీవితాలతో ముడిపడి ఉందన్నారు. ఆర్టీసీ మన అందరిదీ. దీన్ని మనందరం కాపాడుకోవాలి. తెలంగాణ ఆర్టీసీకై ప్రతి సంవత్సరం సీఎం కేసీఆర్ 1500 నుంచి 3 వేల కోట్ల రూపాయలు ఇచ్చి కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

వేలాది మంది ఆర్టీసీ కార్మికులు, లక్షల, కోట్లాది మంది ప్రజలకు మేలు చేయాలని, ఈ సంస్థకు చేదోడు వాదోడుగా సీఎం కేసీఆర్ ఉంటున్నారన్నారు. ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితం. ఆర్టీసీ మనందరిదీ.. ప్రజల కోసం ఉండే ఈ సంస్థను సీఎం కేసీఆర్ కాపాడుతారన్నారు. సిద్ధిపేట ఈ బస్టాండ్ తెలంగాణ ఉద్యమానికి అడ్డా…
తెలంగాణకు సిద్ధిపేట గరిమ నాభి అయితే.., సిద్ధిపేటకు గరిమనాభి సిద్దిపేట బస్టాండ్ అన్నారు. 1531 రోజులు బస్టాండు అడ్డాగా దీక్షలు చేసి తెలంగాణ ఉద్యమం చేశాం అన్నారు.

- Advertisement -