పేదలకు సేవ చేయండి: హరీష్

41
harishrao
- Advertisement -

వైద్య విద్య పూర్తి చేసుకుని ఉన్నత జీవితంలోకి అడుగుపెట్టబోతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి హరీష్‌ రావు. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఎర్పాటు తర్వాత మొదటి బ్యాచ్ గ్రాడ్యుయేట్ లను అభినందించారు.త్వరలోనే అంటే నెల రోజుల్లోనే వేయి డాక్టర్ల పోస్టుల నియామాకానికి నోటిఫికేష్ ఇవ్వబోతున్నాం. ప్లలె దవాఖానాలు, పీహెచ్ సీలు, బస్తీ దవాఖానాల్లో పని చేయడానికి నోటిఫికేషన్ ఇస్తున్నాం అని చెప్పారు. పల్లె ధవాఖాన్ ,బస్తి ధవాఖాన్ లో ,పిహెచ్ సి లు పని చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. పేదలకు సేవ చేసే అదృష్టం కలుగుతుంది. ఈ ఆస్పత్రుల్లో పని చేసే వారికి ఈ అకాడమిక్ లోనే 30 శాతం రిజర్వేషన్లు ఇచ్చాం. ప్రయివేటు, ప్రభుత్వ కళాశాల్లో రిజర్వేషన్ల సౌకర్యం కల్పించాం. 200 డాక్టర్లు ఈ సంవత్సరం పీజీ లో జాయిన్ అయ్యారు అని చెప్పారు.

ప్రభుత్వ ధవాఖాన్ లో జాయిన్ కావాలని కోరుకుంటున్నాను…తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పీజీ సీట్స్ కూడా పెంచినం, తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడినప్పుడు ప్రభుత్వ రంగంలో 570 పీజీ సీట్లు ఉన్నయి. ఈ అకాడమిక్ ఇయర్ నుండి పీజీ సీట్ల సంఖ్య 1212కు పెంచనున్నం. ఏడేళ్లలో డబుల్ సీట్లు పెంచాం.ఈ అకాడమీ కి ఇయర్ లో మరో 200 పీజీ సీట్లు పెంచనున్నాం . ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పెరుగుతాయన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఇంతగా సీట్లు పెరగలేదు. ప్రభుత్వ సెక్టార్ లో చూస్తే 60 శాతం విద్యార్థులకు ప్రభుత్వ ఆసుపత్రిలో పీజీ లుకు అవకాశం ఇస్తున్నాం అని తెలిపారు.

2007 సంవత్సరంలో తెలంగాణ ఉద్యమంలో భాగంగా గాంధీ మెడికల్ కాలేజికి వచ్చి మాట్లాడాను. తెలంగాణ రాష్ట్రంలో రెండే ప్రభుత్వ మెడికల్ కాలేజీలున్నయి. ప్రభుత్వ మెడికల్ కాలేజి ఏర్పాటు చేయలేదు. 200 ఏళ్లక్రితం గాంధీ మెడికల్ కాలేజి బ్రిటిష్ సైన్యం కోసం ఏర్పాటు చేయడం జరిగింది…ఉస్మానియా 100 సంవత్సరాలు క్రితం,గాంధీ బ్రీటిష్ కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాకతీయ ,నిజామాబాద్ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వచ్చాయి. కోస్తా ఆంధ్రలో జిల్లాకో మెడికల్ కాలేజి ఉందని ఆనాడు ఉద్యమంలో ఫైట్ చేశాం అన్నారు. 70 సంవత్సరాలలో 3 కాలేజ్ లో మాత్రమే ఉన్నాయ్ తెలంగాణలో. మూడు ను 33 కళాశాలలు తెచ్చారు మన సీఎం గారు. రాష్ట్రం ఏర్పడ్డ రోజు 700 మెడికల్ సీట్లు ఉంటే ఈ విద్యాసంవత్సరం నుండి 2840 కు సీట్లు పెంచుకోగలుగుతున్నం అన్నారు.

- Advertisement -