పేదలు ఆత్మగౌరవంతో బ్రతకాలి: హరీష్ రావు

361
harishrao
- Advertisement -

సిద్ధిపేట అర్బన్ మండలం నాంచారుపల్లిలో.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు..కొత్తింట్లకు పోయిన ఎస్సీ,గంగిరెద్దుల లబ్ధిదారుల్లో ఆనందోత్సాహాలు..డబుల్ ఇండ్ల సంబురంతో..మురిసిన నాంచారుపల్లె ఎస్సీ, గంగిరెద్దుల కాలనీ..!నిరుపేదలకు ఆత్మ గౌరవంతో బతకాలని డబుల్ బెడ్ రూమ్ గంగిరెద్దుల అభ్యున్నతికి ఏంబీసీ కార్పొరేషన్ రుణాలు అందేలా ప్రత్యేక దృష్టి సారిస్తా.యువత ముందుకొస్తే.. న్యాక్ లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి చూపిస్తా..గుడిసె తప్ప గూడు ఎరుగని మాకు దేవుడిలా వరమిచ్చారని సంబురంతో.. ఇండ్లిచ్చిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు పది కాలాలు సల్లంగా ఉండాలని ఎస్సీ కాలనీ, గంగిరెద్దుల కాలనీ వాసులు దీవెనలు ఇచ్చారు.

సిద్ధిపేట జిల్లా సిద్ధిపేట అర్బన్ మండలం నాంచారుపల్లిలో ఎస్సీ కాలనీలో 16, గంగిరెద్దుల కాలనిలో 20 డబుల్ బెడ్ రూమ్ గృహ ప్రవేశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆ పల్లె వాసులకు గృహ పత్రాలను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సభలో.. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రసంగించారు.

  • నిరుపేదలకు నిలువెత్తు గౌరవం ఇవాళ నాంచారుపల్లి గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు.
  • మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇండ్లు లేని నిరుపేదలకు ఆత్మ గౌరవంతో బతకాలని డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారు.

దేశంలో మరెక్కడా ఇలాంటి ఇండ్లు నిర్మించి ఇవ్వడం లేదని., నిరు పేద ప్రజలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సకల వసతులతో ఇండ్లు నిర్మించి ఇస్తున్నాం అన్నారు. ఇన్నాళ్లు పూరి గుడిసెల్లో నివసించిన నిరుపేదలు ఇప్పుడు ఆత్మ గౌరవంతో జీవిస్తారని చెప్పారు.ఇళ్లు లేకుండా బాధ పడేవారికి సీఎం కేసీఆర్ ఆశీస్సులతో.. రెండు పడకల ఇళ్లు కట్టించాం అన్నారు. మీరు ఆత్మగౌరవంగా బతికేలా ఇళ్లు నిర్మించి ఇచ్చామని, మీరు గౌరవంగా ఉండటమే తెలంగాణ ప్రభుత్వానికి కావాలన్నారు.

గంగిరెద్దుల అభ్యున్నతికి ఏంబీసీ కార్పొరేషన్ ద్వారా ఋణాలు అందేలా ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు. నిజంగా అత్యంత నిరుపేదలకు పిట్టలోళ్లు, పూసలోళ్లు, హోలియ దాసరి, గంగిరెద్దుల ఇలా.. అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇస్తున్నాం. ఇంకా కూడా ఇస్తాం… అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా ఇండ్లు నిర్మించి ఇస్తామని, మిగిలి పోయిన పేదవారికి కూడా మరిన్ని ఇండ్లు నిర్మించి ఇస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.

పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. కరోనా క్లిష్ట సమయంలో కూడా సంక్షేమ పథకాలు ఆపలేదు.. పేదలకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ పెన్షన్లు పెంచారు..గ్రామ యువత ముందుకొస్తే.. న్యాక్ లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి చూపిస్తానని గంగిరెద్దుల కులస్తులకు మంత్రి భరోసా ఇచ్చారు.

యువత ఆలోచనలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఆకాశమే హద్దుగా అవకాశాలు ఉన్నాయని., అందిపుచ్చుకుని సద్వినియోగం చేసుకోవాలని.., యువత ముందుకొస్తే.. అందరికీ శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి మార్గాలు చూపిస్తా అన్నారు. రానున్న రోజుల్లో నాంచారుపల్లి గ్రామ శివారులో రైల్వే లైను వస్తుందని, పరిశ్రమలు వస్తాయని, మహిళలకు, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి వివరించారు.మీ కాళ్లకు మట్టి అంటకుండా మీ గ్రామంలో సీసీ రోడ్ల కోసం రూ.10లక్షలు నిధులు వారం రోజుల్లో మంజూరు చేస్తానని హామీనిచ్చారు. గ్రామాల్లో యువత పెడదారిన పడొద్దు. సోషల్ మీడియా మోజులో పడి జీవితాల్ని నాశనం చేసుకోకండి..

సమయాన్ని వృథా చేస్తూ తిరగడం మంచిది కాదని.. కష్ట పడి పని చేయడానికి ముందుకు వచ్చే వారికి అనేక అవకాశాలు ఉన్నాయంటూ.. పని చేయడానికి ముందుకు వచ్చే యువకులకు శిక్షణ ఇప్పించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ఉన్న చోటే ఉద్యోగం కావాలంటే దొరకదని., యువత గ్రామాలు దాటి ఒక అడుగు ముందుకు వేయాలని., అవకాశం ఉన్నచోట ఉద్యోగం చేయాలని యువతకు ఉపాధి అవకాశాల సందేశం ఇచ్చారు.

అంతకు ముందు గంగిరెద్దుల సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మొదటి గంగిరెద్దుల సంఘ కాలనీ, భవనం సిద్ధిపేట నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు అయ్యిందని, ఇదంతా మంత్రి హరీశ్ రావు కృషితో సాధ్యమైందని వివరించారు. 610జీఓ ప్రకారం 35 కులాలను ఏంబీసీలో చేర్చి మా ఉనికిని గుర్తించిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మంత్రి హోదాలో, ఎమ్మెల్యే స్థాయిలో మాలాంటి వర్గాలతో గ్రామంలో రెండు దఫాలుగా పర్యటించి, ముచ్చటగా మూడవ సారి మమ్మల్ని కొత్తింట్లకు తోలిండని, మా కష్టసుఖాలను పంచుకున్నారని.. ఇలాంటి నాయకుడిని మేమెక్కడా చూడలేదని చెప్పుకొచ్చారు. గంగిరెద్దుల సమాజంలో మా జీవితాలను గుడిసెలలో గడిపే వారమని, కానీ ఇవాళ మంత్రి హరీశ్ రావు ప్రేమ, ఆశీస్సులతో మొదటిసారిగా భవనాలను చూస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, సర్పంచ్ కల్పన నర్సింలు, పంచాయతీ రాజ్ డీఈ వేణు, డీఆర్డీఏ పీడీ గోపాల్ రావు, వివిధ శాఖల అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -