రాష్ర్ట బడ్జెట్ రూ. 2,30,825.96 కోట్లతో ప్రవేశపెట్టారు మంత్రి హరీశ్ రావు. తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశ పెట్టిన హరీశ్ ఇంత పెద్ద గురుత బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపరాఉ. రెవెన్యూ వ్యయం రూ. 1,69,383.44 కోట్లు కాగా ఆర్థిక లోటు అంచనా రూ. 45,509.60 కోట్లు,
పెట్టుబడి వ్యయం రూ. 29.046.77 కోట్లు అని తెలిపారు.
రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణకు రూ. 750 కోట్లు,దేవాదాయ శాఖకు రూ.720 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు హరీశ్ రావు. కరోనా కష్టకాలంలోనూ వ్యవసాయరంగానికి నిధులు కేటాయించామన్నారు. ఆర్టీసీకి రూ. 1500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణలో సాగు విస్తీర్ణం రికార్డు స్ధాయిలో పెరిగింది. నూతన సచివాలయ నిర్మాణానికి రూ. 610 కోట్లు,అటవీ శాఖకు రూ.1276 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.
ఏడేళ్లలో తెలంగాణ ఎంతో ప్రగతి సాధించిందని తెలిపారు. వెయ్యి కోట్ల నిధులతో సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్,స్ధానిక సంస్థల బడ్జెట్‌లో పదిశాతం గ్రీన్ బడ్జెట్,సంపూర్ణంగా బహిరంగ మలవిసర్జన రహితంగా గ్రామాలు నిలిచాయన్నారు. తెలంగాణలో ట్రాక్టర్ లేని గ్రామం లేదని..నల్లె ప్రగతి ద్వారా 5761 కోట్ల విడుదల చేశామన్నారు.