పోరాటల గడ్డ, నల్గొండ జిల్లాలో బీజేపీ ఆటలు సాగవని…మునుగోడులో లోటస్ మునగడం ఖాయమన్నారు మంత్రి హరీశ్ రావు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి, పియూసీ చైర్మన్ ఏ. జీవన్ రెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి,మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డితో కలిసి మీడియా మాట్లాడారు హరీశ్.
మునుగోడు లో బీజేపీ అబద్దాలతో గెలవాలనుకుంటే అది మూర్ఖత్వమే అన్నారు. ప్రధాని రైతులకు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు నెరవేరలేదన్నారు. ప్రధాని క్షమాపణ చెప్పి ఏడాది గడుస్తున్నా రైతులకు చేసిందేమీ లేదు అన్నారు. ప్రధాని హామీల అమలు కావడం లేదు.. బీజేపీ నేతలు మునుగోడు లో గోబెల్స్ లా మాట్లాడుతున్నారన్నారు. దుబ్బాక, హుజురాబాద్, ghmc ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీలకు అంతే లేదన్నారు. ఆ హామీల్లో ఒక్కటైనా అమలైందా, 3 వేల పెన్షన్ అని దుబ్బాక లో అన్నారు,హుజూరా బాద్ లో అన్నారు.. ఇచ్చారా అని తెలిపారు.
ఇపుడు మునుగోడు లో మళ్లీ 3 వేలు ఇస్తామని అంటున్నారు…..బీజేపీ వాళ్ళది నోరా మోరా? అని మండిపడ్డారు హరీశ్. మేము 2016 రూపాయల పెన్షన్ అన్నాం ..ఇచ్చాం అని తెలిపారు. దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 3 వేల పెన్షన్ ఇచ్చి ఇక్కడ మాట్లాడాలని డిమాండ్ చేశారు. పీఎం మోడీ సొంత రాష్ట్రం లో పెన్షన్ 750 రూపాయలు కూడా ఇవ్వడం లేదు ఇక్కడ 3 వేలు ఇస్తారా అని ప్రశ్నించారు.
కోమటి రెడ్డి బ్రదర్స్ కు ప్రభుత్వ పరంగా అవకాశాలు వచ్చినా ప్రజలకు ఏమీ చేయలేక పోయారన్నారు. మిషన్ కాకతీయ కు మిషన్ భగీరథ కు నిధుల సాయం చేయాలని నీతి ఆయోగ్ చెప్పినా బీజేపీ 26 పైసల సాయం చేయలేదన్నారు. 26 పైసల సాయం చేయని బీజేపీ పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డి 3 వేల పెన్షన్ ఇప్పిస్తారట.. ఎవరు నమ్ముతారు…బీజేపీ ధరలు పెంచింది.. పేద ప్రజల నడ్డి విరిచిందన్నారు.