Harishrao:వారొస్తే రైతుల మోటార్లకు మీటర్లు ఖాయం

45
- Advertisement -

ఇన్నాళ్లు అబద్దాలతో బీజేపీ నేతలుఅదరగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు మంత్రి హరీశ్‌ రావు. సిద్దిపేటలో మాట్లాడిన హరీశ్…మోటార్లకు మీటర్ల అంశంపై నిర్మలా సీతారామన్ కుండ బధ్దలు కొట్టారు. తెలంగాణ బిజెపి నాయకులు, ఓట్ల కోసం ఏం ముఖం పెట్టుకొని తిరుగుతారన్నారు. ఈటల రాజేందర్, రఘునందన్, అరవింద్ ఓట్లు ఎలా అడుగుతారు…మోటార్లకు మీటర్లు పెట్టను అని కరాఖండిగా అసెంబ్లీలో చెప్పిన వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. నిర్మలా….బిజెపి తో పాటు కాంగ్రెస్ బండారం బయటపెట్టారన్నారు.

ఈ దేశంలో అనేక రాష్ట్రాలు మోటార్లకు మీటర్లు పెడిత్నన్నరు, తెలంగాణ పెట్టలేదు కాబట్టి డబ్బులు ఇవ్వలేదని నిర్మలా స్పష్టంగా చెప్పారన్నారు. 12 రాష్ట్రాల్లో ఇప్పటికే మీటర్లు పెట్టారు, మరికొన్ని దరఖాస్తు చేశాయి అన్నారని…కేసీఆర్ ఉన్నారు కాబట్టి అది ఇక్కడ సాధ్యం కాలేదు అన్నారు. రైతుల పక్షాన నిలబడ్డది ఒక్క కేసీఆర్ మాత్రమేనని..కాంగ్రెస్ పాలిత రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో మీటర్లు పెట్టేందుకు అంగీకరించాయన్నారు.

తప్పిపోయి తెలంగాణలో గెలిస్తే ఇక్కడ కూడా మీటర్లు పెడతారని…5 గంటల కరెంట్ అని శివకుమార్ బట్టబయలు చేశారు..కాంగ్రెస్, బిజెపి రెండు రైతుల పాలిత శత్రువులు అన్నారు. యూపీఏ వేసిన స్వామినాథన్ కమిటీని ఆ పార్టీ తుంగలో తొక్కిందన్నారు. మోడీ గెలవగనే అమలు చేస్తాం అని చెప్పి మోసం చేశారని…స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు కోసం కాంగ్రెస్ ఏనాడైనా పోరాటం చేసిందా ఆలోచించాలన్నారు.రెండు పార్టీలు రైతులను దగా చేశాయని…బిజెపి పాలిత యుపి, అస్సాం, మణిపూర్ లో మీటర్లు పెట్టారన్నారు. దేశంలో మోటార్లకు మీటర్లు పెట్టానని అసెంబ్లీలో ప్రకటించిన ఏకైక రాష్ట్రం, ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు.

69 లక్షల రైతుల ప్రాణాలు ముఖ్యం, 25 వేల కోట్లు మా ప్రభుత్వానికి ముఖ్యం అన్నారు. చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా..కాంగ్రెస్ కు ఓటు వేస్తే బాయిల కాడ మీటర్లు పెట్టేందుకు అంగీకరించినట్లే అన్నారు.బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికే మీటర్లు పెట్టారు…సాక్ష్యాధారాలతో మాట్లాడుతున్నా.. ఎవరు వస్తరో రండి చర్చకు సవాల్ విసురుతున్న అన్నారు. రైతును నిలబెట్టింది కేసీఆర్, మనం ఇప్పుడు కేసీఆర్ ను నిలబెట్టాలన్నారు.

Also Read:మరో రెండేళ్లు కెప్టెన్ గా రోహిత్ శర్మ?

- Advertisement -