బీజేపీ ఫేక్ వాట్సప్ ప్రచారాన్ని తిప్పికొట్టండి: హరీష్ రావు

41
harishrao
- Advertisement -

బిజీపి ఫేక్ వాట్సప్ ప్రచారం చేస్తున్నది… తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు మంత్రి హరీష్ రావు. ఏ అంశంలో చూసినా తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది. కానీ బిజెపి నేతలు జూటా మాటలు మాట్లాడుతున్నారన్నారు. ఆలేరు నియోజకవర్గ యువజన విద్యార్థి సోషల్ మీడియా విభాగం సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు…ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశంలో మూడో స్థానం లో ఉంది. డబుల్ ఇంజన్ గ్రోత్ అని చెప్పుకునే వాళ్ల యూపీ అట్టడుగున ఉందన్నారు.

ఇక్కడి బండి, గుండు మాటలు చెప్పుమంటే కోటలు దాటుతయి. మేం అడ్డుకుంటే ఒక్కరు కూడా బయట తిరగలేరన్నారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 15 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని మేమంటే.. 7 లక్షల ఉద్యోగాలే ఖాళీ ఉన్నాయి అంటరు. కనీసం ఇదన్న ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. కానీ అవి కాకుండా రైల్వే, బ్యాంకుల్లో, డిఫెన్స్ లో ఉన్నాయి. అన్ని 15 లక్షల ఉద్యోగాలు నింపుమని ఢిల్లీలో బిలియన్ మార్చ్ చేయు బండి సంజయ్ నీకు దమ్ముంటే…రాజ్యాంగం గురించి సీఎం కేసీఅర్ గారు ఏం తప్పు మాట్లాడారు.. అంబేడ్కర్ గారే చెప్పారు.. నేను రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారనీ, అవసరం అయితే రద్దు చేయాలన్నారు.

దేశంలో రాజ్యాంగ స్ఫూర్తి పోతున్నది న్యాయం చేయాలి అంటున్నాం. జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్లు పెంచాలి అంటే పట్టించుకోరు.
బిజెపి అంటేనే కోతలు.. కోతలు తప్ప ఏం లేదు.. 5 రాష్ట్రాల ఎన్నికలు కాగానే వాతలు పెడుతారు..పెట్రో డీజిల్ గ్యాస్ ధరలు పెంచడానికి సిద్దంగా ఉన్నారన్నారు. బడ్జెట్ లో తెలంగాణకు ఒకటన్న ఉన్నదా..కేంద్రం తెలంగాణను చిన్న చూపు చూస్తున్నది. ఇక్కడి బీజెపి నేతలకు నైతికత లేదన్నారు.

- Advertisement -