ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడండి: హరీశ్‌ రావు

87
harishrao
- Advertisement -

వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని చెరువులు నిండిపోయాయనని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు చెప్పారు.వర్షాలు, వరదలు తాజా పరిస్థితులు, జిల్లా ప్రగతి, అభివృద్ధి పనుల పురోగతి పై సిద్ధిపేట కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అడిషనల్ కలెక్టర్లు ముజమ్మీల్ ఖాన్, శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి మంత్రి సమీక్ష జరిపారు. జిల్లాలోని 181 చెరువులు నిండాయని, 131 చెరువులు నిండి మత్తడి దూకుతున్నాయని మంత్రి వెల్లడించారు.

జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా 534 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని, 4 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, వాటిలో సిద్ధిపేట డివిజనులో 326, గజ్వేల్ డివిజన్ లో 154, హుస్నాబాద్ డివిజన్ -54 చొప్పున ఇళ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు, అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

జిల్లా అధికార యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండాలని, స్థానిక ప్రజా ప్రతినిధుల సమన్వయం చేసుకుంటూ అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని… జూలై నెలాఖరు, ఆగస్టు మొదటి వారం (శ్రావణ మాసం)లో గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని 14 గ్రామాలలో 435 నూతన గృహా ప్రవేశాలు చేయించేందుకు సర్వ సన్నద్ధ సన్నాహాలు చేయాలని జిల్లా కలెక్టర్, గజ్వేల్ ఆర్డీఓకు మంత్రి సూచించారు. డిసెంబరు నెలాఖరులోగా గజ్వేల్ రింగురోడ్డు పనులు పూర్తి చేయాలని ఆర్అండ్ బీ అధికారి ఈఈ సుదర్శన్ కు మంత్రి ఆదేశం. అసంపూర్తి పనులపై ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, ఆర్అండ్ బీ అధికారులతో చర్చించి, అసంపూర్తి పురోభివృద్ధి పనులకు అవసరమైన చర్యలు తీసుకోవాలలన్నారు.

ఎలాంటి అవాంతరాలు, కోర్టు కేసులు లేకుండా భూసేకరణ చేపట్టడమే కాకుండా దేశంలోనే తొలిసారి అతివేగంగా పూర్తయిన రైల్వే లైను ప్రాజెక్టు కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వే లైను ప్రాజెక్టుగా మంత్రి వెల్లడించారు. సిద్ధిపేట-దుద్దేడ రైల్వే లైను పనులు త్వరితగతిన చేపట్టాలని రైల్వే శాఖ అధికారులకు ఫోను లైనులో మంత్రి హరీశ్ రావు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో కేవలం మిగిలిన దుద్దేడ-సిద్ధిపేట రైల్వే లైను నిర్మాణంలో ప్రత్యేక చొరవ, శ్రద్ధ చూపాలని, రైల్వే అధికారులతో పురోభివృద్ధి పనుల ప్రగతిపై సమీక్ష జరపాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కు , జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు, పురోభివృద్ధి పై రైల్వే అధికారులను ఫోన్ లైనులో ఆరా తీశారు.

- Advertisement -