ఉగ్రగోదారి.. 66.70 అడుగులకు చేరిన నీటిమట్టం

70
bhadrachalam
- Advertisement -

గోదావరి ఉగ్రరూపం తగ్గడంలేదు. భారీ వర్షాలతో భద్రాలచం వద్ద ప్రమాదకర స్ధాయిని మించి ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీగా వరద పోటెత్తడంతో నీటిమట్టం ప్రస్తుతం రికార్డు స్థాయిలో 66.70 అడుగులకు చేరింది. 22.03 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్నది. మరికొన్ని గంటల్లో గోదావరి నీటిమట్టం 70 అడుగులు దాటే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తుండగా 1976 నుంచి గోదావరి నీటిమట్టం 60 అడుగుల మార్క్‌ను దాటడం ఇది ఎనిమిదోసారి. ముందుజాగ్రత్త చర్యగా అధికారులు భ్రదాచలం వంతెనను మూసివేశారు. బ్రిడ్జిపై నుంచి ఎలాంటి వాహనాలను రాకపోకలకు అనుమతించడం లేదు.

వర్షాల కారణంగా భద్రాచలంలోని పలు కాలనీలు వరదలో మునిగిపోయాయి. కొ దీంతో నివాసాలను ఖాళీ చేయించి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.

- Advertisement -