ప్రతిపక్షాలకు కండ్లు, చెవులు ఉన్న లేనట్టేనని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట అర్బన్ మండలం ఏన్సాన్‌పల్లి గ్రామంలో రైతు వేదిక,విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్‌తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపనలు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు…. కాంగ్రెస్ హయాంలో మడి ఎండకుండ రైతులు పంట పండించారా? అని ప్రశ్నించారు. కాళేశ్వరంతో పాటు ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులపై విపక్షాలు దుష్ర్పచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
తెలంగాణ బోర్డర్‌లో మహారాష్ట్ర రైతులు జాగలు కొంటున్నారు. బోర్లు వేసి నీళ్లు తరలించుకుంటున్నారు. ఇది కాదా తెలంగాణ అభివృద్ధి అని ప్రశ్నించారు. మహారాష్ట్రలో మొన్నటి దాకా బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది… ఇదీ వాళ్ల అభివృద్ధి అని దుయ్యబట్టారు. పంజాబ్ మాదిరిగానే తెలంగాణలో వడ్లు కొనేదాకా కేంద్రాన్ని వదలబోమని హరీశ్‌రావు తేల్చిచెప్పారు.