నిరాడంబరుడు…నంది ఎల్లయ్య: మంత్రి హరీష్‌ రావు

204
harishrao nandi ellaiah
- Advertisement -

మాజీ ఎంపీ,కాంగ్రెస్ సీనియర్ నేత నంది ఎల్లయ్య మృతిపట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి హరీష్ రావు. నంది ఎల్లయ్య మృతి పట్ల సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సానుభూతిని తెలిపిన హరీష్ … ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థించారు. సిద్ధిపేట ఎంపీగా ఆయన ఉన్న సమయంలో తాను ఎమ్మెల్యేగా కలిసి పనిచేశాను. రాజకీయాల్లో నిరాడంబరాన్ని చాటుకున్న మంచి మనసున్న వ్యక్తిత్వం ఎల్లయ్యది అన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన నంది ఎల్లయ్య..5 సార్లు సిద్దిపేట నుండి ఒకసారి నాగర్‌కర్నూల్‌ నుండి ఎంపీగా గెలుపొందారు. రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు.

- Advertisement -