మన ఆరోగ్యం.. మన చేతుల్లోనే…!

116
Harishrao
- Advertisement -

సీజనల్ వ్యాధుల నియంత్రణపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం మన ఆరోగ్యం మన చేతుల్లోనే కార్యక్రమాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా డెంగ్యూ, ఇతర కాలానుగుణ వ్యాధుల నివారణలో భాగంగా తన ఇంటి పరిసరాల్లో స్వయంగా పారిశుధ్యం నిర్వహించారు మంత్రి హరీశ్ రావు. ప్రజలంతా ప్రతి ఆదివారం 10 నిమిషాలు ఇంటి చుట్టు పరిశుభ్రతకు కేటాయించాలని పిలుపునిచ్చారు.

ఇళ్లలోని కుండీలు, గాబులు, డ్రమ్ములు, నీటి తొట్టి, మేడ మీద ఉన్న కూరగాయల పాదులను పరిశీలించి, ప్లాస్టిక్ సామగ్రిని తనిఖీ చేసి నీరు నిల్వ ఉండకూడదని, నిల్వ నీటితో డెంగ్యూ దోమలు వృద్ధి చెందుతాయని తెలిపారు. ఇళ్ళ మధ్య గల ఖాళీ స్థలాల్లో మురుగు నీరు, వర్షం నీరు చేరడంతో ఆయా స్థల యజమానులకు సమాచారం ఇచ్చి ఆయా స్థలం బాగు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు హరీశ్.

 

ఇవి కూడా చదవండి..

వారి నుండి ప్రాణహాని ఉంది: పూరి

బీజేపీ సార్లు…వీరేవరో మీకు తెలియదా?

ట్రెండింగ్‌లో నాట్‌ ఫర్‌ సేల్‌…

- Advertisement -