తెలంగాణలో హింసా రాజకీయాలకు తావు లేదన్నారు మంత్రి హరీష్ రావు.హైదరాబాద్ యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. అనంతరం మాట్లాడిన హరీష్..ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు.చిన్న పేగుకు నాలుగు చోట్ల గాయం కావడంతో తొలగించారని తెలిపారు.
ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం గురించి విపక్షనేతలు దిగజారి మాట్లాడుతున్నారని ఆరోపించారు. సీనియర్ నాయకులు కూడా చిల్లర మాటలు మాట్లాడటం దురదృష్టకరమన్నారు. గతంలో ఇలాంటి ఘటనలు జరగలేదని చెప్పారు. సీఎం కేసీఆర్కు పనితనం తప్ప.. పగతనం లేదన్నారు.
. నేతలపై దాడులను తెలంగాణ సమాజం హర్షించదని తెలిపారు. ప్రభాకర్ రెడ్డి ఘటనపై విచారణ జరుగుతున్నదని, దాడి వెనుక ఉన్న కుట్రను పోలీసులు తేల్చుతారని చెప్పారు. బీఆర్ఎస్ మొదటి నుంచి ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుందని తెలిపారు.
Also Read:NBK:బాలయ్య అంటే అంత చులకనెందుకు?