సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే సిద్దిపేట అభివృద్ధి..!

64
Minister Harish Rao
- Advertisement -

సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే సిద్దిపేట అభివృద్ధి సాధ్య‌మైంద‌న్నారు మంత్రి హ‌రీష్ రావు. జిల్లా కేంద్రంలోని చిన్న‌కోడూరు మండ‌ల కేంద్రంలో ఆర్అండ్‌బీ రోడ్డు నిర్మాణ ప‌నుల‌కు శంకుస్ధాప‌న చేశారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడిన హ‌రీష్ రావు.. సిద్దిపేట నియోజకవర్గంలో 20 ఏండ్ల క్రితం బుస్సాపూర్ నుంచి తిమ్మాయిపల్లి వరకు సింగిల్ రింగురోడ్డును కేసీఆర్ ఆనాడే వేయించార‌ని గుర్తుచేశారు.

7 మండలాలైన కొండపాక, తొగుట, దుబ్బాక, సిద్దిపేట రూరల్, నారాయణరావుపేట, చిన్నకోడూర్, నంగునూరు పరిధి మీదుగా 88 కిలో మీటర్ల మేర రింగురోడ్డును నిర్మిస్తామన్నారు. ఈ రింగురోడ్డును 12 గ్రామాలు బుస్సాపూర్, పుల్లూరు, మల్యాల, గంగాపూర్, మాచాపూర్, చిన్నకోడూర్, రామునిపట్ల, గోనెపల్లి, ఓబులాపూర్, పాలమాకుల, వెంకటాపూర్, బందారం గ్రామాల మీదుగా నిర్మిస్తామన్నారు.బీజేపీ దురాగాతాలను ప్రజలకు క్షేత్రస్థాయిలో వివరించాలని ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి పిలుపునిచ్చారు.

- Advertisement -