డయాలసిస్ సెంటర్ దేవుడిచ్చిన వరం…

53
- Advertisement -

దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని పని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్‌ సెంటర్ను మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్, ఆసుపత్రుల మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ రాజు, కలెక్టర్ పమేలా సత్పతి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ… డయాలసిస్ సెంటర్లు కిడ్నీ రోగులకు దేవుడు ఇచ్చిన ఒక వరం అని అన్నారు. దేశంలో ఎక్కడ లేనన్ని డయాలసిస్ సెంటర్‌లు తెలంగాణలో ఉన్నాయాన్నారు. దీనికి కారణం సీఎం కేసీఆర్ అని గుర్తు చేశారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు బస్ పాస్ లు, ఆసరా పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. తెలంగాణ ఏర్పడక ముందున్న మూడు డయాలసిస్ కేంద్రాలను 102 కు పెంచామని స్పష్టం చేశారు. చౌటుప్పల్‌లో క్యాన్సర్ పేషంట్ల కోసం పాలియేటివ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

మునుగోడు నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రిని ప్రారంభిస్తామని అన్నారు. తెలంగాణలో 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయగా వచ్చే సంవత్సరం మరో ఎనిమిది కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. నల్గొండ ,సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసిన చరిత్ర సీఎం కేసీఆర్‌ దేనని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి…

బీఆర్ఎస్‌ గెలిస్తే..పోలవరం పూర్తి

సీవరేజ్ ట్రీట్‌మెంట్‌ సిటీగా హైదరాబాద్‌..

బర్త్ డే..మొక్కలు నాటిన ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి

- Advertisement -