రైతులను సంఘటితం చేయాలన్నది సీఎం ఆకాంక్ష:హరీశ్

121
harish rao
- Advertisement -

రైతులను సంఘటితం చేయాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అన్నారు మంత్రి హరీశ్‌ రావు. సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు మండలం నందిగామలో రైతువేదిక, షాపింగ్‌ కాంప్లెక్స్‌ను మంత్రి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంపై ఏటా రూ.35 వేల కోట్లు వెచ్చిస్తున్నదని, దేశంలో ఇంత‌ ఖర్చు ‌చేస్తున్న రాష్ట్రం‌ తెలంగాణ మాత్రమేనన్నారు.

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి డెబ్భై ఏండ్లు దాటినా రైతుల పరిస్థితి మారలేదన్నారు. అందరికీ సంఘాలున్నప్పటికీ రైతులకు మాత్రం లేవని చెప్పారు. రైతులను సంఘటితం చేయాలన్నది సీఎం ఆకాంక్ష అని స్పష్టం చేశారు. ప్రాజెక్టులు నిర్మించడంతో ఇప్పుడు కరెంటు ఉన్నా లేకున్నా రెండు పంటలు పండించే పరిస్థితి వచ్చిందని వెల్లడించారు.

అనంతరం పఠాన్‌చెరు టౌన్‌లో గాంధీ థీమ్ పార్కుకు మంత్రి శంకుస్థాపన చేశారు. రూ.1.6 కోట్లతో పార్కును నిర్మిస్తున్నామని చెప్పారు. కార్పోరేషన్ ఎన్నికల్లో ఇచ్చిన హమీని ‌నిలబెట్టుకునేందుకు తొలి అడుగు వేశామన్నారు.

- Advertisement -