స‌మంత‌పై నెటిజన్స్‌ ట్రోలింగ్‌..!

183
sam
- Advertisement -

అక్కినేని హీరోయిన్ స‌మంత సోషల్ మీడియా హుషారుగా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు.. సమాచారాన్ని షేర్ చేస్తూ ఉంటుంది. సామ్‌పెట్టే పోస్టులు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. అయితే ఈ అమ్మడు తాజాగా పెట్టిన ఒక ఫోటో ఇప్పుడు పెను సంచలనంగా మారింది. రోటీన్ కు భిన్నంగా ఉన్న ఈ ఫోటోను పోస్టు చేసిన కాసేపటికే సామ్‌ డిలీట్ చేసింది. అయితే.. అప్పటికే ఆ ఫోటో వైరల్‌గా మారటం.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఆ పోస్ట్‌ ఎంటనేగా మీ సందేహం.

ది ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్‌లో విల‌న్‌గా నటించిన స‌మంత దీని ప్ర‌మోష‌న్ కోసం ముంబై వెళ్ళింది. అక్క‌డ త‌న స్టైలిస్ట్ ప్రీత‌మ్ జుకల్కర్ అనే వ్యక్తిపై కాళ్లు పెట్టి సోఫాలో పడుకున్న ఫొటో దిగి సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. నాలుగేళ్ల బంధం మాది అని పేర్కొంది. దీనికి ప్రీత‌మ్ ఐ ల‌వ్ యూ అని కామెంట్ పెట్టాడు. అయితే ఎంత చ‌నువు ఉంటే మాత్రం అలా ఆయ‌న మీద కాళ్ళు పెట్టి ఫొటో దిగ‌డం ఏంటి? ఆయ‌న దీనికి ఐ ల‌వ్ యూ అని రిప్లై ఇవ్వ‌డ‌మేంట‌ని తెగ ట్రోల్ చేశారు. దీంతో స‌మంత ఆ పోస్ట్‌ని వెంట‌నే తొల‌గించింది. స‌మంత న‌టించిన ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ ఫిబ్ర‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

- Advertisement -