నాడు కాంగ్రెస్,టీడీపీ పార్టీలు వలసవాద పార్టీలని విమర్శించిన కోదండరాం…ఇవాళ అదే పార్టీలతో కలిసి ఏవిధంగా పనిచేస్తారని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్‌లో హరీష్ రావు సమక్షంలో ప్రైవేట్ ఉద్యోగుల సంఘం నేతలు టీఆర్ఎస్‌లో చేరారు.ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్..కోదండరాం,కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టారు. జర్నలిస్టులను జైల్లో పెట్టిన ఘనత కాంగ్రెస్‌ది అన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ చేసిన మోసాన్ని కోదండరాం మర్చిపోయారని…ఆ పార్టీకి ఏజెంట్‌గా మారారని మండిపడ్డారు. నాడు జేఏసీ నాయకుడిగా కొదండరాంను తెలంగాణ సమాజం గౌరవిస్తే ఆ గౌరవానికి తలవంపులు తెచ్చేలా ఆయన వైఖరి ఉందన్నారు.
అమరావతి వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు దర్శకత్వంలో కొదండరాం పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. నాడు ఉద్యమ సమయంలో ఉస్మానియా విద్యార్థులపై కాంగ్రెస్ పార్టీ కేసులు పెడితే, ఆ విద్యార్థులకు బెయిల్ ఇప్పించింది టీఆర్ఎస్ అని గుర్తుచేశారు. కాంగ్రెస్, టీడీపీలతో టీజేఎస్ పొత్తు పెట్టుకోవడాన్ని తెలంగాణ సమాజం హర్షించడం లేదని అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్,టీడీపీలతో ఎందుకుకలిశారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ప్రొపెసర్లు,డాక్టర్లు,విద్యార్థులను ఎంపీలు,ఎమ్మెల్యేలు చేసిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. కోదండరాం తెలంగాణ ఉద్యమ సమయంలో ఇప్పుడు కాంగ్రెస్‌కు ఏజెంట్‌గా పనిచేస్తున్నారని మండిపడ్డారు.
ఏనాడైనా కాంగ్రెస్ ఏజెండానే కోదండరాం అమలుచేస్తారని తెలిపారు. సంగారెడ్డి దారులన్నీ టీఆర్ఎస్ వైపే ఉన్నాయన్నారు. కాంగ్రెస్,టీజేఎస్,బీజేపీ నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్‌లో చేరుతున్నారని చెప్పారు. నాడు తెలంగాణ ఉద్యోగులను కాంగ్రెస్ తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందన్నారు. రాష్ట్ర హక్కులు,ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రజలంతా టీఆర్ఎస్‌కు మద్దతు పలకాలన్నారు.