అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలోని కొండా భూదేవి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగ దినోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ప్రజలందరికీ ప్రపంచ యోగ దినోత్సవ శుభాకాంక్షలు. యోగ నిత్యా జీవితంలో భాగం చేసుకోవాలి…. యోగాను దినచర్యలో భాగంగా చేసుకోని, దీర్ఘాయుష్షును పొందాలన్నారు.
ప్రపంచంలో చాలామందికి మన తీసుకునే ఆహారం అలవాట్ల వలనే రోగాలు వస్తాయి. యోగ ద్వార రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు యోగ చెయ్యవచ్చు అన్నారు. యోగ చేస్తే శారీరక, మానసిక సమస్యల నుండి కాపాడుకోవచ్చు. యోగ, వాకింగ్, సూర్య నమస్కారాలు వలన రోజు మరింత పనులు బాగచేసుకోవచ్చు. భారత దేశాన్ని చూసి వివిధ దేశాల యోగ నేర్చుకున్నాయన్నారు.
యోగా ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగ పడుతుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణీ యోగ లాంటి శిక్షణ ఇస్తున్నాము. గర్బిణి స్త్రీలు ఇలాంటివి చేస్తే నార్మల్ డేలవరిలకి అవకాశం ఉంటుందన్నారు.