ఎంబీసీలకు ఆర్థిక చేయూత: హరీష్ రావు

106
harishrao
- Advertisement -

అంకిత భావం, నిబద్ధత, నిజాయితీ, చిత్తశుద్ధిలతో B.Cల కోసం దశాబెడ్ఆఆలుగా జీవన పయనం కొనసాగిస్తున్న డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు B.C కమిషన్ చైర్మన్ హోదాకు పరిపూర్ణంగా అర్హుడని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.

గురువారం నాడు తన్నీరు హరీష్ రావు డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావును ఘనంగా సన్మానించారు. పట్టణంలోని ఆయన నివాసానికి వెళ్లి కృష్ణ మోహన్ ను శాలువా,పుష్ప గుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా తన్నీరు మాట్లాడుతూ అనతికాలంలోనే సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ అగ్ర రాష్ట్రంగా నిలబడటం శుభ పరిణామం అన్నారు.ఇది కేసీఆర్ ప్రభుత్వానికి, బలహీన వర్గాల సమగ్ర వికాసం పట్ల ఉన్న నిబద్ధత కు నిదర్శనం అన్నారు.

కిస్తీలతో సంబంధం లేకుండా పూర్తి ఉచిత గ్రాంటు గా M.B.C లకు ఆర్థిక చేయూత అందించిన ఏకైక రాష్ట్రం మనదే అని చెప్పుకోవడం సంతోషం కలిగిస్తుంది అన్నారు.ప్రజలు అడగకముందే వారి జీవన ప్రమాణాల పెరుగుదలకు అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న రాష్ట్రం కూడా తెలంగాణ మాత్రమే అని చెప్పుకోవడం గర్వంగా ఉందని అన్నారు.వకుళాభరణం ను కలిసి అభినందించిన వారిలో పూర్వ విద్యార్థి పరిషత్ ,సరస్వతి విద్యాపీఠం ప్రతినిధులు హరిస్మరణ్ రెడ్డి,చాల్లేటి రాజారెడ్డి, బొడ్డు శ్రీనివాస్, బుర్రా నటరాజ్, తదితరులు ఉన్నారు.

- Advertisement -