తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత సబ్బండవర్ణాల వారికి తెలంగాణ ప్రభుత్వం పేద్దపీట వేస్తోందన్నారు మంత్రి హారీశ్ రావు. హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో మంత్రులు హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్తగా 1000మత్స్యకార సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని మంత్రి తెలిపారు. దీని ద్వారా రాష్ట్రంలో నీలి విప్లవంతో పాటు పడుతున్న సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. 18యేండ్లు నిండిన మత్స్యకారులకు మార్కెటింగ్ సొసైటీలో సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్సీ బండ ప్రకాశ్‌తో సహా ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఎన్నో ఏండ్ల నుంచి కొత్త మత్స్య పారిశ్రామిక సొసైటీలు ఏర్పాటు చేయాలని, నూతన సభ్యత్వాలు ఇవ్వాలని మత్స్య కారుల నుంచి డిమాండ్ ఉంది. గత ప్రభుత్వాలు వారి డిమాండ్ పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నూతనంగా మత్య్స సహాకార సంఘాలను ఏర్పాటు చేయాలనే నిర్ణయంతో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారని… అందుకే ప్రభుత్వం కొత్త సహకార సంఘాలు ఏర్పాటు చేసి మత్స్య కారులకు ఉపాధి కల్పించాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసే 650 మత్స్య సహకార సంఘాల్లో సభ్యులకు నైపుణ్య పరీక్షలు పూర్తయ్యాయి. మరో 334 సంఘాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది.
18 ఏండ్లు నిండిన మత్స్య కారులకు మార్కెటింగ్ సోసైటీల్లో సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. దీని వల్ల 18 ఏండ్లు నిండిన మత్స్యకారులకు ప్రభుత్వం పథకాలకు అర్హులు అవుతారు అని తెలిపారు.
650 మత్స్య సహకార సంఘాల్లో 13 వేల 900 మందికి సభ్యత్వం ఇవ్వడం జరిగిందన్నారు. మరో 334 సంఘాల్లో సభ్యత్వం కోసం నైపుణ్య పరీక్షలు జరుగుతున్నాయి. ఈ సంఘాల్లో మరింత మంది మత్స్యకారులకు సభ్యత్వం లభించనుంది. మూడు నెలల్లో ఈ సభ్యత్వ ప్రక్రియ పూర్తి చేయాలని మత్స్య శాఖ అధికారులకు మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. సభ్యత్వ ప్రక్రియ వేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..