దేశంలో పేదలకు ఉత్తమ వైద్య సేవలు అందించే విషయంలో తెలంగాణ మూడోస్థానంలో ఉందని, త్వరలోనే మొదటి స్థానం లో నిలపాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆశయం అని… ఆశయ సాధనకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది కృషి చేయాలనీ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు అన్నారు.
ఆదివారం IDOC లోని మీటింగ్ హాల్ లో తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్ల కు స్మార్ట్ మొబైల్ ఫోన్ లు, 4G సిమ్ లు పంపిణీ చేసే రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. కామారెడ్డి జిల్లాలో 772 మంది ఆశా కార్యకర్తల కు స్మార్ట్ మొబైల్ ఫోన్ లు, 4G సిమ్ లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు పంపిణీ చేశారు.సాంకేతిక టెక్నాలజీ అందిపుచ్చుకొని ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు వీలుగా తెలంగాణ లోని 27 వేల మంది ఆశా వర్కర్లకు స్మార్ట్ మొబైల్ ఫోన్లను అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు. స్మార్ట్ ఫోన్ లో ద్వారా నేరుగా గర్భిణిలు, రోగుల సమాచారాన్ని అక్కడికక్కడే ఆన్లైన్లో నమోదు చేసే అవకాశముందన్నారు. అలాగే ANM-1, ANM-2 లకు ఐ- ప్యాడ్ లను అందజేయ నున్నట్లు తెలిపారు.
కరోనా కష్ట సమయంలో ఆశ వర్కర్లు క్షేత్రస్థాయిలో చాలా చక్కగా పని చేశారని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. ఫీవర్ సర్వే విజయవంతంగా చేసి కరోనా కట్టడి లో విశేష కృషి చేశారని కొనియాడారు. ఆశ వర్కర్ల కష్టాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గుర్తించి వేతనాలు పెంచారని గుర్తుచేశారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లో గొర్రె తోక బెత్తడు అన్నట్టు 1500 మాత్రమే ఉండేదని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఆ వేతనాన్ని 3 వేలకు అక్కడినుంచి 7,500 కు పెంచారని మంత్రి గుర్తు చేశారు.ఈమధ్య ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెంచినప్పుడు ఆశ వర్కర్లు దరఖాస్తు దండం పెట్టకుండానే , రోడ్డు ఎక్కి ధర్నాలు రాస్తారోకోలు చేసే అవకాశం ఇవ్వకుండా నే వారి వేతనాన్ని 9750 రూపాయలకు పెంచారని తెలిపారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఆశ వర్కర్ల వేతనం కేవలం 4 వేల రూపాయలు మాత్రమే నని మంత్రి తెలిపారు. అదే తెలంగాణ లో తెరాస ప్రభుత్వం హయాంలో ఆశ వర్కర్ల నెలసరి వేతనం 9750 రూపాయలు అని మంత్రి తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రo మధ్యప్రదేశ్లో అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్ లో ఆశ వర్కర్ల వేతనం కేవలం 3 వేలు మాత్రమే అని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో కూడా ఆశావర్కర్ల సౌకర్యాలు పెంచుతామని తెలిపారు. గతంలో ఆశ వర్కర్ల వేతనాలు రెండు మూడు నెలలకు ఒకసారి వచ్చేదని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం హయాంలో ప్రతి నెల మొదటి వారంలో జీతాలు ఆశ వర్కర్లకు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు. దీనిని బట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆశ వర్కర్ల పైన ఎంత ప్రేమ ఉందో గుర్తుంచుకోవాలని మంత్రి తెలిపారు. ఆశ వర్కర్లు గట్టిగా పని చేస్తే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని మంత్రి అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి ఆరోగ్య వారధులు ఆశావర్కర్లు అని మంత్రి స్పష్టం చేశారు.
ఆశ వర్కర్లు చక్కగా పని చేస్తున్నప్పటికీ ఇంకా కొన్ని అంశాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు తెలిపారు. ముఖ్యంగా గర్భిణీ విషయంలో ఇంకా మారాల్సిన అంశాలు ఉన్నాయన్నారు. రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న జిల్లాల్లో కామారెడ్డి కూడా ఒకటని మంత్రి తెలిపారు.ఈ విషయంలో రాష్ట్ర సగటు 68 శాతం కాగా కామారెడ్డి సగటు 78 శాతంగా ఉందన్నారు.ఆశలు గర్భిణులను ఆసుపత్రికి తీసుకు వెళితే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం ను వైద్యులు చెక్ చేస్తారని మంత్రి తెలిపారు.ఒకవేళ తక్కువగా ఉంటే ఐరన్ టాబ్లెట్స్ ఇస్తారని అన్నారు. ఈ టాబ్లెట్ను గర్భిణీలు క్రమం తప్పకుండా చూడాల్సిన బాధ్యత ఆశ వర్కర్ల దేనని తెలిపారు.గర్భిణీ లను మొదటిసారి చెకప్ తీసుకొచ్చే శాతం 94 శాతం ఉండగా నాల్గవ రౌండ్ కు వచ్చేసరికి 60% ఉంటుందన్నారు. మొదటి నాలుగు రౌండ్ల మధ్య 34 శాతం వ్యత్యాసం ఉంటుందన్నారు . దీన్ని తగ్గిస్తే గర్భిణీలలో రక్తహీనత లేకుండా జాగ్రత్త పడవచ్చునని మంత్రి తెలిపారు.
గర్భిణీలలో రక్తహీనతను సమస్యలను దూరం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఆరోగ్య లక్ష్మి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి రోజూ గర్భిణుల కు గుడ్డు, పాలతో పాటు వేడి భోజనం గర్భిణులకు అందించడం జరుగుతుందన్నారు. ఆ దిశగా గర్భిణి లలో ఆరోగ్య చైతన్యం తీసుకురావాల్సిన బృహత్తర బాధ్యత ఆశ వర్కర్ల మంత్రి సూచించారు.
ఇకనుంచి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు వద్ద తమ పరిధిలోని గర్భిణుల జాబితా, కాంటాక్ట్ నెంబర్ ల వివరాలు ఉండాలని అని మంత్రి ఆదేశించారు. ప్రతిరోజు వారికి వైద్యాధికారులు ఫోన్ చేసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ మండలాల పర్యటన కు వెళ్ళినప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన వైద్యుల వద్ద ఉన్న గర్భిణి ల జాబితా, contact నెంబర్ ల వివరాలు పరిశీలించాలని సూచించారు.4 రౌండ్ లు పూర్తి అయ్యే వరకు గర్భిణులను క్రమం తప్పకుండా మానిటరింగ్ చేస్తే రక్తహీనతను సమస్యను పూర్తిగా అధిగమించవచ్చునని ఆయన తెలిపారు. టాబ్లెట్ లతో రక్తహీనత సమస్య పోకపోతే ఇంజెక్షను కూడా ఉన్నాయని మంత్రి తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో సహజ ప్రసవాల శాతం మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు కామారెడ్డి జిల్లాలో 61% సెక్షన్లు అవుతుండగా 39 శాతం మాత్రమే నార్మల్ డెలివరీ జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.మిగతా జిల్లాల తో పోల్చుకుంటే ఇది రివర్స్లో ఉందని మంత్రి తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఉత్తర తెలంగాణలో సెక్షన్లు అధికంగా జరుగు తున్నట్లు తన నివేదికలో పొందుపరిచింది మంత్రి స్పష్టం చేశారు.ఆపరేషన్ల వల్ల తల్లితో పాటు బిడ్డకు అనారోగ్యమైన అని మంత్రి తెలిపారు పుట్టిన బిడ్డ ఒక గంట లోపల తల్లి ముర్రు పాలు తాగితే రోగనిరోధక శక్తి గణనీయంగా పెరిగి ఆరోగ్యంగా ఉంటాడు అని తెలిపారు. సెక్షన్ ల వల్ల బిడ్డ పుట్టిన మొదటి గంటలో ముర్రు పాలు తాగే అవకాశాన్ని కోల్పోతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సెక్షన్ ల వల్ల కలిగే అనర్థాలను గర్భిణీలకు, వారి బంధువులకు గురించి సహజ ప్రసవాల కోసం వారిని సన్నద్ధం చేయాలని అని సూచించారు.పక్షం రోజుల క్రితం మహబూబ్ నగర్ జిల్లా వెళ్లి రివ్యూ చేశానని అని అక్కడ 70% నార్మల్ డెలివరీ లు 30 శాతం మాత్రమే సిజెరియన్ లు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. సంగారెడ్డి లో 65 శాతం, జహీరాబాద్ లో 65% సహజ ప్రసవాలు జరుగుతున్నాయని తెలిపారు.అందుకు విరుద్ధంగా కామారెడ్డి జిల్లాలో జరుగుతుందని మంత్రి తెలిపారు.చేతులు జోడించి మొక్కుతున్న జిల్లాలో ఈ పరిస్థితి రివర్స్ కావాలని ఆశ వర్కర్లు వైద్యాధికారులకు మంత్రి సూచించారు.
కామారెడ్డి జిల్లాలో మొదటి డోసు వ్యాక్సినేషన్ 100% జరిగినప్పటికీ రెండవ డోసు వ్యాక్సినేషన్ 83 శాతం మాత్రమే జరిగిందని మంత్రి తెలిపారు పక్క జిల్లాల కరీంనగర్ హనుమకొండలో 100% రెండో రోజు కూడా పూర్తయిందని మంత్రి తెలిపారు.ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి కామారెడ్డి జిల్లాలో రెండో వ్యాక్సినేషన్ 100% పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.అలాగే హెపటైటిస్ బి, బర్త్ dose వాక్సినేషన్ వందశాతం చేయడంతో పాటు క్షయ వ్యాధి రహిత జిల్లాగా కామారెడ్డి జిల్లా ను తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. అలాగే క్షయ వ్యాధి బాధితులకు ప్రభుత్వం ప్రతి నెల అందిస్తున్న రూ 500 రూపాయలను క్రమం తప్పకుండా వారికి అందేలా చూడాలన్నారు. అలాగే జిల్లాలో క్షయ వ్యాధి బాధితులను గుర్తించడం, సకాలంలో చికిత్స అందించడం పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎన్ కాస్ లో క్వాలిఫై అయి… ఎన్ కాస్ సర్టిఫికేట్ పొందాలని మంత్రి సూచించారు. ఈ సర్టిఫికేట్ తో… ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి రూ 4 లక్షల 50 వేల రూపాయలు ప్రతి సమాచారం అదనంగా అందుతాయని మంత్రి తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో NCD నిర్దేశిత లక్ష్యం 7 శాతం కాగా ఇప్పటివరకు 3.44 శాతం మందిని మాత్రమే స్క్రీనింగ్ చేశారని తెలిపారు. మిగతా లక్ష్యం ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని తెలిపారు డయాబెటిస్ బిపి బాధితులను గుర్తించి వారికి ప్రభుత్వం అందించే టాబ్లెట్లను క్రమం తప్పకుండా అందేలా వారు వాటిని ఉపయోగించుకునే చూడాల్సిన బాధ్యత ఆశ వర్కర్ల పైన ఉందన్నారు ఆ దిశగా వారిని గైడ్ చేయాలని సూచించారు టాబ్లెట్లు క్రమం తప్పకుండా వాడితే వారికి కిడ్నీలు గుండె జబ్బులు ఈ వ్యాధుల బారిన పడకుండా ఉంటారని తెలిపారు అలాగే త్వరలోనే డయాబెటిక్ బిపి బాధితుల కోసం ప్రత్యేకంగా NCD కిట్ ను అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కిట్ ద్వారా బీపీ షుగర్ గోలీలు అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామాలలో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆశావర్కర్ లు, వైద్యాధికారులు ముఖ్య భూమిక పోషించాలని ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.రానున్న రోజుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వైద్యాధికారి వారిగా పనితీరును ట్రాక్ చేస్తామని మంత్రి తెలిపారు.ప్రతినెల ఆశ వర్కర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని వారి పనితీరును సమీక్షిస్తోంది మంత్రి తెలిపారు.
ఇప్పటికే ప్రజా ఆరోగ్య సంరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొట్ట మొదటి మూడు రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది అని మంత్రి తెలిపారు. ప్రథమ స్థానం ప్రథమ స్థానంలో కేరళ ఉండగా రెండవ స్థానంలో తమిళనాడు ఉందన్నారు మూడవ రాష్ట్రం మూడో స్థానంలో తెలంగాణ ఉందని మంత్రి తెలిపారు.వైద్యాధికారులు లు ధ్యానము శాఖ సిబ్బంది ఆశ వర్కర్లు సమిష్టిగా పని చేస్తే త్వరలోనే తెలంగాణ రాష్ట్రం దేశంలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటుందని తెలిపారు. బాగా పనిచేసే ఉద్యోగులను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని విధుల పట్ల నిర్లక్ష్యం వహించే ఉద్యోగులను శిక్షిస్తామని మంత్రి తెలిపారు. తెలంగాణలోని సర్కారు దవాఖానాల్లో మందులు లేని పరిస్థితి ఉండదని మంత్రి స్పష్టం చేశారు బడ్జెట్ కేటాయింపులు పెంచి సౌకర్యాలను మెరుగు పరుస్తామని మంత్రి స్పష్టం చేశారు
కామారెడ్డి మార్చురినీ రూ.48 లక్షల 50 వేల రూపాయల తో అధునీకరుస్తామని మంత్రి తెలిపారు. దోమకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంగా అప్గ్రేడ్ చేసినప్పటికీ ఇంకా వైద్యవిధాన పరిషత్ అప్పగించ లేదని మంత్రి తెలిపారు.వెంటనే వైద్యవిధాన పరిషత్ కు అప్పగించేలా అదేశి స్తామని తెలిపారు.స్థానిక ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు దోమకొండ లో మార్చురీ సేవలను కూడా అందుబాటులోకి తెస్తామని మంత్రి హామీ ఇచ్చారు.అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రత్యేక చొరవ తో తెలంగాణలోని 61 మార్చురీ లను 32 కోట్ల 50 లక్షల రూపాయలతో ఆధునికరిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
కామారెడ్డి పట్టణంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వంద పడకల సామర్థ్యం గల మాత శిశు సంరక్షణ కేంద్రాన్ని వచ్చే నాలుగు నెలల్లో ప్రారంభించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు . ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తి కావాలంటే మరో రూ.10 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అధికారులు స్పష్టం చేశారని వెంటనే ఈ నిధులను విడుదల చేసి ఆస్పత్రిని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. వంద పడకల మాత శిశు సంరక్షణ ఆస్పత్రి ఆవరణలోనే మరో 150 పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని మంత్రి తెలిపారు.అలాగే ఇక్కడే రూ.3.5 కోట్లతో టి- డయాగ్నస్టిక్ సెంటర్ , రేడియాలజీ ల్యాబ్ ప్రారంభించి పాతో లజి, రేడియాలజీ సేవలను రోగులకు అందుబాటులోకి తెస్తామని మంత్రి తెలిపారు.
గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మెడికల్ ఆఫీసర్లు గా పనిచేస్తున్న వారికి PG సీట్లలో 33 శాతం రిజర్వేషన్ కల్పించామని మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో వైద్యాధికారులు చేస్తున్న సేవలను గుర్తించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. ప్రైవేటు కళాశాలలో పీజీ చేయాలంటే 1.5 కోట్ల నుంచి 2 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందన్నారు.అలాగే కాంట్రాక్టు వైద్యాధికారులు, ఏఎన్ఎంలకు ప్రభుత్వ పోస్ట్ ల రిక్రూట్మెంట్ సమయంలో వెయిటేజ్ ఇస్తున్నామని మంత్రి తెలిపారు.
ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ…కామారెడ్డి కొత్త జిల్లాగా ఆవిర్భవించిన తర్వాత జిల్లా నలుమూలల నుంచే కాకుండా, పక్క జిల్లాల నుంచి కూడా రోగులు వైద్య సేవల కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి వస్తున్నారని తెలిపారు.ఒక్కోసారి ఆసుపత్రిలో నాలుగువందల డెలివరీలు కూడా జరుగుతున్నాయని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.అలాగే జిల్లా కేంద్ర ఆసుపత్రి జాతీయ రహదారి పక్కనే ఉండడం వల్ల రోడ్డు ప్రమాదాలు బారిన పడిన బాధితులు ఎక్కువగా జిల్లా కేంద్ర ఆసుపత్రికి సత్వర వైద్య సేవల కోసం వస్తున్నారని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా కేంద్ర ఆసుపత్రి ని వంద పడకల సామర్థ్యం నుంచి 130 పడకల సామర్థ్యానికి పెంచడం జరిగిందని తెలిపారు.
అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ , ఎస్పీ కార్యాలయాలను ప్రారంభించే సమయంలో జిల్లాకు ఒక సంవత్సరంలో మెడికల్ కాలేజ్ ను మంజూరు చేస్తా హామీ ఇచ్చారని మంత్రికి గుర్తు చేశారు. దీనికి స్థల గుర్తింపు ప్రక్రియను కొద్ది రోజుల లో పూర్తి చేస్తామని తెలిపారు. కళాశాల మంజూరు, నిర్మాణం సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని కోరారు.దీంతోపాటు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మాతాశిశు సంరక్షణ ఆసుపత్రి ఆవరణ లో కొత్తగా 130 పడకల సామర్థ్యం గల హాస్పిటల్ నిర్మించాలని మంత్రిని కోరారు. అలాగే దోమకొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో పోస్ట్ మార్టం నిర్వహణకు అనుమతి ఇవ్వాలని, అక్కడ వైద్యుల సంఖ్య పెంచాలని మంత్రికి ప్రభుత్వం విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ విజ్ఞాపన లపై రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సానుకూలంగా స్పందించారు.
సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వాకాటి కరుణ, జైరాబాద్ ఎంపీ శ్రీ బి బి పాటిల్, ప్రభుత్వ విప్ శ్రీ గంప గోవర్ధన్, జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్, ఎల్లారెడ్డి శాసనసభ్యుడు సురేందర్, జుక్కల్ శాసన సభ్యుడు హనుమంత్ షిండే, మెదక్ శాసనసభ్యురాలు పద్మాదేవేందర్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, వైస్ చైర్ పర్సన్ హిందూ ప్రియా, జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, ఇంచార్జి జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, ప్రభుత్వ ఆసుపత్రి సూపర్-ఇండెంట్ అజయ్ కుమార్, వైద్యులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
అంతకుముందు రాష్ట్ర ఆర్థిక మన రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తో కలిసి జిల్లా కేంద్ర ఆస్పత్రిని సందర్శించారు.రోగులకు వైద్య సేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.ఇన్స్టిట్యూషన్ పాటు డెలివరీ లతో పాటు సహజ ప్రసవాలను పెంచాల్సిన బాధ్యత పెంచాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు.ఆ వెంటనే కామారెడ్డి పట్టణంలోని వంద పడకల సామర్థ్యం తో నిర్మాణంలో ఉన్న మాత శిశు సంరక్షణ కేంద్రం ను మంత్రి తనిఖీ చేశారు. నిర్మాణ పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు ఈ నెలలో నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన నిధులను మంజూరు చేస్తామని తెలిపారు.