కిషన్‌ రెడ్డిపై సీఎం కేసీఆర్ సెటైర్‌

49
CM KCR
- Advertisement -

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై సెటైర్లు వేశారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్లో మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్…బడ్జెట్ తాను సరిగా అర్ధం చేసుకోలేదని చెప్పిన కిషన్ రెడ్డి…బడ్జెట్ నిధులు తగ్గించింది వాస్తవం కాదా అన్నారు. ఎరువుల కోత,అన్నిరంగాలకు నిధుల కోత విధించారన్నారు. తుపాకీ రాముడి కథలతో దేశం అభివృద్ధి చెందదన్నారు. చర్చకు వస్తే తాము సిద్దమని తెలిపిన సీఎం….కిషన్ రెడ్డి ప్రజలను గోల్ మాల్ చేస్తున్నారని దుయ్యబట్టారు.

అన్నిరంగాలను అమ్ముతున్నారు ఇది నిజం కాదా అని ప్రశ్నించారు సీఎం. బ్యాంకులు, రైల్వేలు,ఎల్‌ఐసీ,విమానయానం ఇలా అన్నిరంగాలను అమ్ముతున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రైవేటీకరణతో దేశం అభివృద్ది చెందదన్నారు. విద్యుత్‌ను ప్రైవేటికరించి కార్పొరేట్ గద్దలకు అప్పగించేందుకేనని మండిపడ్డారు. దేశంలో చెత్త విద్యుత్ పాలసీ అమల్లో ఉందన్నారు.

బీజేపీని తరిమికొట్టకపోతే దేశం నాశనం అవుతుందన్నారు. తెలంగాణ రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తే ప్రధానికి ఏం నష్టమో చెప్పాలన్నారు. శ్రీకాకుళంలో 25 వేల విద్యుత్ మీటర్లు బిగించింది వాస్తవం కాదా కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. బండి సంజయ్‌ని చూస్తే జాలేస్తుందన్నారు. నిరుద్యోగం పెరిగింది వాస్తవం కాదా కిషన్ రెడ్డి చెప్పాలన్నారు.

- Advertisement -