అహింసా మార్గంలోనే తెలంగాణ..

52
harishrao
- Advertisement -

అక్టోబర్ 2 వ తేదీన గాంధీ ఆసుపత్రి ఎదుట ఏర్పాటు చేస్తున్న గాంధీ విగ్రహావిష్కరణ నేపథ్యంలో మంత్రులు తన్నీరు హరీశ్ రావు గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు పరిశీలించారు. మంత్రులతో పాటు డీఎంఈ రమేష్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్, ఆసుపత్రి సూపరిండెంట్ రాజారావు.

ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమవేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..గాంధీ ఆసుపత్రి వద్ద పదహారు అడుగుల గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తుండటం సంతోషం. కోవిడ్ సమయంలో అత్యద్భుత సేవలు అందించింది గాంధీ ఆస్పత్రి. ఆక్టోబర్ 2న సీఎం కేసిఆర్ గారి చేతుల మీదుగా ఉదయం 10 గంటలకు విగ్రహం ఆవిష్కరణ జరుగుతుందని మంత్రి హరీష్ తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణం లో భారీ బహిరంగ సభలో సీఎం మాట్లాడతారని అన్నారు. నెల్సన్ మండేలా లాంటి గాంధీ చూపిన అహింసా మార్గాన్ని అవలంభిచారన్నారు. కేసీఆర్ గారు సైతం 14 ఏళ్ళు అహింసా మార్గంలో రాష్ట్ర సాధన ఉద్యమం చేపట్టి తెలంగాణ ను సాధించారని అన్నారు.

- Advertisement -