ఇది పేదల బడ్జెట్: మంత్రి హరీశ్‌ రావు

270
harishrao minister
- Advertisement -

ప్రజలందరికి మంచి జరగాలని, సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా పేదల సంక్షేమం కోసం, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునేలా బడ్జెట్‌ను రూపొందించామని చెప్పారు మంత్రి హరీశ్‌ రావు. ఇవాళ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుండగా జూబ్లీహిల్స్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్‌ రావు… స్వామివారి ఆశీస్సులతో 2021-22 బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టబోతున్నామని చెప్పారు. ఈ బడ్జెట్‌ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం అన్నిరకాలుగా మేలు చేస్తుందనే సంపూర్ణమైన విశ్వాసం ఉందని చెప్పారు. స్వామివారి దయతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

- Advertisement -