కోవిడ్ పరీక్షలు తప్పనిసరి: స్పీకర్‌ పోచారం

97
pocharam

ఈ నెల 13, 14 తేదీల్లో నిర్వహించబోవు శాసనసభ, శాసనపరిషత్తు సమావేశాల నేపధ్యంలో కోవిడ్ మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని అందరి శ్రేయస్సు దృష్ట్యా సమావేశాలు నిర్వహణ విషయంలో తీసుకోవాలసిన జాగ్రత్తలపై శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, శాసన పరిషత్తు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉభయ సభల ప్రాంగణాలలో కోవిడ్ పరీక్షల నిర్వహణ నిమిత్తం ప్రత్యేకంగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిందిగా శాసనమండలి కార్యదర్శి డా. వి నరసింహా చార్యులును ఆదేశించారు.

సమావేశాలకు హాజరయ్యే శాసనసభ్యులు, శాసన పరిషత్తు సభ్యులు, ఉభయ సభల సిబ్బంధి, మీడియా ప్రతినిధులు, పోలీసు సిబ్బంది లలో ఎవరికైనా అనుమానంగా ఉన్నా లేదా కరోనా లక్షణాలు కనిపించినా తప్పక పరీక్షలు చేయించుకోవాల్సిందిగా స్పీకర్, చైర్మన్ లు ఆజ్ఞాపించారు. ఈ పరీక్ష కేంద్రాలు ఉభయ సభల ప్రాంగణాలలో 12 వ తేది (సోమవారం) మధ్యాహ్నం 2 గంటల నుండి పనిచేస్తాయి.