వాళ్ల తిట్లకు నేను భయపడను- మంత్రి హరీష్‌

157
harish rao
- Advertisement -

సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని ఘనపూర్, గుడికందుల గ్రామంలో మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే క్రాంతికిరన్. ఎన్నికల ప్రచారం.. రోడ్ షోలో పాల్గొన్నారు. అంతకుముందు గ్రామంలోని కాలభైరవ స్వామి ఆలయంలో మంత్రి హరీశ్ రావు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ.. బీహార్‌లో మోడీ డబుల్ ఇంజన్ గ్రోత్ అంటున్నాడు.. ఇక్కడ కూడా అధికారంలో టీఆర్‌ఎస్‌ ఉన్నది.. దుబ్బాకలోనూ టీఆర్‌ఎస్‌ గెలిస్తేనే అభివృద్ధి ఉంటదన్నారు. తెలంగాణ రాక ముందు రైతుల పరిస్థితి అత్యంత దుర్భరం. కాంగ్రెస్, తెలుగుదేశంల పాలనలో రైతుల ఆత్మహత్యలే మిగిలాయి. తెలంగాణ వచ్చాక రైతుల పరిస్థితి మారిందా లేదా ? అని మంత్రి ప్రశ్నించారు. నాటి నైజం పాలన నుండి నిన్నటి సమైక్యాంధ్ర పాలన వరకు ప్రతి ఒక్కరు భూమి ఉన్న వారి వద్ద శిస్తు వసూలు చేశారు. ఒక్క కేసీఆర్ మాత్రం చరిత్ర తిరగరాసి భూమి ఉన్న ప్రతి వారికి రైతుబంధు పథకం ద్వారా డబ్బులు ఇచ్చారు. రైతుల బతుకుల్లో మార్పు రావాలని సీఎం కేసీఆర్, 24 గంటల ఉచిత కరెంట్, రైతు బంధు ఇస్తున్నారు. వాళ్లు పైసలో.. సీసాలో ఇస్తారు.. లేదంటే హరీశ్ రావు ను తిడుతరు. బీజేపీ ఫారిన్ మక్కలు తెచ్చి తెలంగాణ కోళ్లకు పోస్తే.. మన మక్కలు ఎవడు బుక్కాలి ? అని మంత్రి మండిపడ్డారు.

బీజేపీ ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తున్నది. మార్కెట్లను ప్రయివేటు పరం చేసి రైతులకు మద్దతు ధర లేకుండా చేస్తున్నారు. వాళ్ల తిట్లకు భయపడను.. దీవెనలుగా తీసుకుంటా.. ఇంకా బలపడతా..! అని హరీష్‌ తెలిపారు. బీజేపీ పాలిస్తున్న 17 రాష్ట్రాల్లో, కాంగ్రెస్ పాలిస్తున్న 5 రాష్ట్రాల్లో ఎక్కడైనా 24 గంటల ఉచిత కరెంట్, ఎకరాకు 10 వేలు ఇస్తున్నారా చెప్పి వాళ్ళు ఓట్లు అడగాలి. వచ్చే మూడేళ్లు అధికారంలో ఉండేది మేము.. అభివృద్ధి మాతోటి కాక వాళ్ళతోటి అయితదా. అన్నారు. కాంగ్రెస్ చేతిలో నెత్తి లేదు.. కత్తి లేదు.. వాళ్లెం చేస్తరు. బీజేపీ గోబెల్స్ ప్రచారం తప్ప మరేమీ లేదు. రాదనుకున్న తెలంగాణను, కాదనుకున్న కాళేశ్వరం నీళ్లను తెచ్చిన ఘనత కేసీఆర్ ది అని మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు.

- Advertisement -