కరోనా బారినపడ్డ బిగ్ బాస్ బ్యూటీ..

101
Himanshi Khurana

బిగ్ బాస్-13 కంటెస్టెంట్, నటి హిమాంషి ఖురానా తనకు కరోనా వైరస్ పాజిటివ్ అని ప్రకటించింది. ఇటీవలి కాలంలో తనతో కాంటాక్ట్ లో ఉన్నవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరింది.అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ తనకు పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని హిమాంషి ఖురానా పేర్కొంది.

అయితే ఆరోగ్యంగా ఉన్నానని, త్వరలో ఈ వైరస్ బారి నుంచి బయటపెడతానని ఆమె తెలిపింది. బిగ్ బాస్-13 షో ఫైనలిస్టుల్లో ఒకరైన ఆసిమ్ రియాజ్‌తో హిమాంషి పలు మ్యూజిక్ వీడియోలు చేసింది.రైతు బిల్లులకు నిరసనగా ఈ నెల 25 న ముంబైలో జరిగిన ప్రదర్శనల్లో ఈమె పాల్గొంది.