కిషన్ రెడ్డిది రెండు నాలుకల ధోరణి- మంత్రి హరీష్‌

172
Minister Harish Rao
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం విధానాల వల్ల రైతులకు మద్ధతు ధర కన్నా ఒక్క రూపాయి ఎక్కువ ఇవ్వలేని పరిస్థితి తీసుకువచ్చిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ లో సీసీఐ, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. 17 సెప్టెంబర్ 2020న ధాన్యం మద్ధతు ధర కంటే రైతుకు ఒక్క రూపాయి ఇచ్చినా రాష్ట్రం నుంచి బియ్యం,వడ్లు సేకరించేది లేదని స్పష్టం చేస్తూ కేంద్రం రాష్ట్రాలకు లేఖ పంపింది. ఈ లేఖ విడుదల చేస్తున్నామని మంత్రి తెలిపారు.

ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా గాని, ప్రత్యక్షంగా గాని మద్ధతు ధర కంటే ఒక్క రూపాయి అదనంగా ఇస్తే. మేం లేవీగా ఈ వడ్లు తీసుకునేది లేదని రాష్ట్రాన్ని హెచ్చరిస్తూ కేంద్రం లేఖలో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం సన్న రకాలకు ఎక్కువ ధర ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ ఈ లేఖను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెనక్కు తీసుకునేలా చేయాలని కోరుతున్నా అని మంత్రి హరీష్‌ తెలిపారు.

ఈ లేఖ రాష్ట్రం మెడ మీద కత్తిపెట్టేలా ఉంది. దీని వల్ల ఒక్క పైసా సన్న వడ్లకు రాష్ట్రాలు ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రాలకు ఏఫ్‌సీఐ మెడమీద కత్తిపెట్టింది. ఒక్క రూపాయి మద్ధతు ధర కన్నా ఎక్కువ ఇస్తే మీ రాష్ట్రం నుంచి బియ్యం కాని, వడ్లు కాని సేకరించేది లేదని తెల్చి చెప్పింది. కేంద్రం ఈ విషయంలో రాష్ట్రాల కాళ్లు, చేతులు కట్టేసింది. ఈ లేఖను కేంద్రం విత్ డ్రా చేసుకోవాలి అని మంత్రి డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో పండే ధాన్యం మన అవసరాల కన్నా మూడింతలు పండుతుంది. 87 లక్షల 84 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రాష్ట్రంలో పడింది. మన రాష్ట్ర అవసరాలకు 26 లక్షల టన్నులు మాత్రమే చాలు. అరవై లక్షల మెట్రిక టన్నులు మేం తీసుకోమంటే ఏం చేయాలి. కేంద్రం పరోక్షంగా సన్న వడ్లకు ఒక్క రూపాయి అదనంగా ఇవ్వద్దని లేఖ రాస్తూ… అదే కేంద్ర మంత్రి ఎక్కువ ధర చెల్లించాలని డిమాండ్ చేయడం రెండు నాలుకల ధోరణి కాదా అని మంత్రి హరీష్‌ రావు ప్రశ్నించారు.

- Advertisement -