మంగళవారం మంత్రి హరీష్ రావు సమక్షంలో సిద్దిపేట జిల్లా తొగుట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మాగౌడ్ టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు వంద మంది కాంగ్రెస్, బిజెపి నుండి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరిని మంత్రి హరీష్ రావు టీఆర్‌ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యాక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ : రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకువస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై యువత పెద్ద ఎత్తున టిఆర్ఎస్‌లో చేరుతున్నారు. కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టులు ఆలస్యం అవడానికి కారణం కాంగ్రెస్ వాళ్లు కేసులు వేయడం వల్లనే అని మంత్రి విమర్శించారు. టిఆర్ఎస్ పార్టీ కి విశ్వాసం విశ్వతనీయత ఉంది. కొండపోచమ్మ, రంగనాయక సాగర్ భూనిర్వాసితులకు ఎలా పరిహారం అందిందో మల్లన్నసాగర్ బాధితులకు కూడా అదేవిధంగా నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు.
తొగుట నుండి అధిక మెజార్టీ టిఆర్ఎస్ కు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ రైతులకు కరెంటు ఇవ్వక మోసం చేసినందుకు ఓట్లు అడుగుతరా?.. కాళేశ్వరం ప్రాజెక్టు వద్దని కోర్టులో కేసులు వేసినందుకు అడుగుతరా? అని మంత్రి హరీష్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటే ఒక్క రూపాయి ఇవ్వలేదు. హుజూర్ నగర్‌లో ఓట్ల కోసం అక్కడికి కెసిఆర్ పోలేదు కానీ గెలిచాక మూడు వందల కోట్ల అభివృద్ధి చేసిండు అని మంత్రి అన్నారు.
తెలంగాణ వచ్చాక మూడు ఉప ఎన్నికలు అయితే అన్నింటిలో భారీ మెజార్టీతో టిఆర్ఎస్ గెలిచింది.. దుబ్బాక కూడా అంతకు డబుల్ మెజారిటీ తో గెలుస్తాము. దుబ్బాకను అన్ని విధాలా అభివృద్ధి చేసిండు రామలింగారెడ్డి. టిఆర్ఎస్ ప్రభుత్వం వాస్తవాలను చెప్తుంది.. గోబెల్స్ ప్రచారం చేయదు. తొగటకు ఇంటడుగు జాగలో అవసరమున్నన్ని డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.