మోసాల చరిత్ర కాంగ్రెస్ పార్టీది.. త్యాగాల చరిత్ర టీఆర్ఎస్ పార్టీది..

231
Minister Harish Rao
- Advertisement -

రాష్ట్ర బీజేపీ దళిత మోర్చ కౌన్సిల్ స‌భ్యుడు ఎల్లం( ఎల్లయ్య) తో పాటు దాదాపు 150 మంది అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సిద్దిపేట‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి హ‌రీశ్‌రావు వీరంద‌రికీ గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా హ‌రీశ్ మాట్లాడుతూ… ఉత్తమ్ కుమార్ దుబ్బాకు వస్తే వాళ్ల మైకులే ఫెయిల్ అయ్యాయి. పరాయి లీడర్లు, పరాయి కార్యకర్తలతో కాంగ్రెస్ మీటింగ్‌లు న‌డుస్తున్నాయ‌న్నారు.

కాంగ్రెస్, బీజేపీ పోటీ రెండో స్థానం కోసమేన‌న్నారు. టీఆర్ఎస్‌, కేసీఆర్ లేకపోతే ఉత్తమ్ జై తెలంగాణ అనే వాడా? రాదనుకున్న తెలంగాణను ప్రాణాలు ఫణంగా పెట్టి తెచ్చిన కేసీఆర్ దా మోసం లేక ఆంధ్ర నేతల మోచేతి నీళ్లు తాగి తెలంగాణకు అడ్డుప‌డిన మీదా మోసం ప్రజలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలని ప్ర‌శ్నించారు. మోసాల చరిత్ర కాంగ్రెస్ పార్టీది. త్యాగాల చరిత్ర టీఆర్ఎస్ పార్టీదన్నారు. స‌ముద్రమంతా సాయం సీఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం దుబ్బాక‌కు చేస్తే, బీజేపీ సాయం కాకి రెట్టంత అని మంత్రి హ‌రీశ్‌రావు అన్నారు.

సోష‌ల్ మీడియాలో బీజేపీ చేసే గోబెల్స్ ప్ర‌చారానికి నోబెల్ బహుమ‌తి ఇవ్వాల‌న్నారు.సీఎం కేసీఆర్ సోలిపేట సుజాతను పార్టీ అభ్యర్థిగా ప్రకటించినప్పుడే ఆమె విజయం ఖాయం అయింది. దుబ్బాక 80వేల మంది రైతులు ఉన్నారు. వారందరి మద్దతు టీఆర్ఎస్ వైపే. దుబ్బాకలో రెండో స్థానం కోసమే ప్రతిపక్షాల పోరాటం చేస్తున్నాయని మంత్రి హరీష్‌ ఎద్దేవ చేశారు.

- Advertisement -