బీజేపీ మాటలు వింటే మోసపోతం..గోస పడుతం

112
Minister Harish Rao

బీజేపీ ఝూట మాటలు వింటే మోసపోతాం…గోస పడతామన్నారు మంత్రి హరీశ్ రావు. ప్రచారానికి వచ్చి దొంగ మాటలు చెబుతున్న కాంగ్రెస్, బీజేపీ నేతలను మీరు ప్రజలకు ఏం చేశారని నిలదీయాలన్నారు. కరెంటు ఇవ్వక మోటర్లను కాల్చిన కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వెయ్యాలో ప్రశ్నించాలన్నారు.

రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంటు ఇస్తున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా…? కాలేశ్వరం నుండి గోదావరి జలాలు తెచ్చి బీడు భూములకు సాగునీరు ఇచ్చేది టీఆర్ఎస్ కాదా అన్నారు. కాళేశ్వరం నీళ్లు వస్తే ఇక బోర్లు ఎండయి..బావులు దంగవు.. రైతులు దేర్యంగా రెండు పంటలు పండించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి..కాలువల తవ్వకం ఇప్పటికే మొదలయిందన్నారు.

రైతు బంధు,రైతు బీమా,కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్,ఆసరా పెన్షన్లు,బీడీ కార్మికుల మహిళకకు బీడీ పెన్షన్లు ఇస్తున్నది వాస్తవం కాదా..?అన్నారు. BJP నేతలు గ్రామాల్లోకి వచ్చి ఝుటా మాటలు చెబుతున్నారు…రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలకు బీజేపీ ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టి బీజేపీ రైతుల వద్ద ముక్కు పిండి బిల్లులు వసూలు చేయమంటుందన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టేది లేదని కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారన్నారు.