ఆరోగ్య వంతమైన సమాజం కోసం కృషిచేయాలి: ఈటల

119
minister etela
- Advertisement -

53వ ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ సౌత్ జోన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు మంత్రి ఈటల రాజేందర్. మెంటల్ పీస్ లేకుండా ఆరోగ్యవంతమయిన సమాజం ఉండదు…మనిషి మానసిక పరిస్థితి లను బట్టే మనిషి ఉంటాడని తెలిపారు.

మానసికంగా బాగోకపోవడంతో.. ఎన్నో అనర్ధాలకు దారితీస్తున్నాయి…ఒక దిశ, నిర్భయ సంఘటనలు మానవాళిని కదిలిస్తున్నాయి…మనిషికి సర్వ సుఖాలు ఉన్నా… జీవితం తృప్తి లేదు ఎన్నో టెస్ట్ లు చేయించుకున్నా అన్నారు.

ఎన్ని హాస్పిటల్స్ కు ఖర్చు చేస్తున్నా.. మానసిక నిపుణులను కలిస్తే అన్నిటికంటే మంచిది….ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లో పేషన్స్ సంఖ్య పెరిగింది…జిల్లా కేంద్రాలలో కూడా మానసిక డాక్టర్స్ పెట్టాం…ట్రీట్మెంట్ అంటే మందులు ఇవ్వడం కాదన్నారు. ముందు వారికి కౌన్సిలింగ్ ఇచ్చే మానసిక నిపుణులు ఉంటే పేషెంట్ రోగం త్వరగా నయం అవుతుంది…తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి జరగాలంటే.. ఆరోగ్య వంతమయిన ప్రజలు ఉండాలన్నారు.

- Advertisement -