బీజేపీని నమ్ముతే మన బ్రతుకు ఆగమైతది- హరీష్‌

133
harish rao minister

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం ధర్మాజీపేటలో కళాకారుల ధూమ్ ధామ్‌తో టిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచార కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. స్వంత నియోజకవర్గంలో సీటు గెలువలేని ఉత్తమ్ దుబ్బాక లో గెలుస్తడా.. ఓట్ల కోసం ప్రతి పక్షాలు పైసలిస్తే మనం బ్రతకం.. జీవితాంతం బ్రతికేది చూసుకోవాలన్నారు.

బీడీల ఫెన్షన్ 1600 ఇస్తున్నట్టు బిజెపి బండి సంజయ్ చూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా నంటే ఎందుకు వస్తలేరు. జూటా మాటల బిజెపిని నమ్ముతే మన బ్రతుకు ఆగమైతది. మాట తప్పని, మడమ తిప్పని పార్టీ టిఆర్ఎస్.. రేపు గెలిచాక సుజాత అక్కకు దగ్గరుండి పనులు చేపిస్తా అని మంత్రి తెలిపారు. ఏ ఆపద వచ్చిన సుజాత అక్క కు తమ్మునిగా అండగా ఉంటా. జై తెలంగాణ అంటే టిఆర్ఎస్.. టిఆర్ఎస్ అంటే జై తెలంగాణ అని మంత్రి అన్నారు.

ఒక చేతితో రెండు జెండాలు మోసిన వారిని జై తెలంగాణ అనిపిచ్చింది టిఆర్ఎస్. తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవిని గడ్డిపోసలా రాజీనామా చేసింది మేము.. బిజెపి కిషన్ రెడ్డి కాదు.ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అని మోసం చేసింది బిజెపి. మోడి రాష్ట్రంలో పించను ఇచ్చేదా 500..మన దగ్గర 2000. 17 బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ 2000 ఇస్తుండ్రో చెప్పాలని ప్రశ్నించారు. మూడు రోజులు టిఆర్ఎస్ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలి.. మూడేండ్లు మీకు అండగా ఉంటామని మంత్రి హరీష్‌ రావు హామీ ఇచ్చారు.