బీజేపీ డబుల్ ఇంజన్ గ్రోత్ ఎక్కడకి పోయింది.. మంత్రి హరీష్‌ ఫైర్‌..

114
harish
- Advertisement -

సోమవారం సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో పోటీ పరీక్షల ఉద్యోగార్థులకు ఉచిత భోజనం, స్టడీ మెటీరియల్ అందజేత మంత్రి హరీష్‌ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో ప్రతియేటా ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తాం. గ్రూప్-1, 2 ఇంటర్వ్యూలు లేకుండా రాత పరీక్షతో పారదర్శకతతో ఉద్యోగ నియామకాలు ఉంటాయన్నారు. త్వరలోనే 500 పైగా గ్రూప్-1 ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల చేస్తాం. గ్రూప్ -1లో కూడా 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తాం. ఈ ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు.

317జీఓతో అన్నీ జిల్లాల ఉద్యోగులకు సమ న్యాయం చేస్తున్నాం. దీనిపై ప్రతిపక్షాలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు మాట్లాడటం తగదు. 317జీఓ సారాంశం తెలియకుండా బీజేపీ బండి సంజయ్ ఎందుకు దీక్ష చేపట్టారో.., ఏమిటో.. రాష్ట్ర ప్రతిపక్షాలు దున్నపోతు ఈనిందటే దుడ్డేను కట్టేయన్నట్లు ఉన్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న 15 లక్షల 65 వేల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తుందో రాష్ట్ర బీజేపీ నేత బండి సంజయ్ తెలపాలని డిమాండ్ చేశారు. కేవలం ఒక్క రైల్వేశాఖలో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, బీజేపి నాయకులను ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఇస్తామంటే మీకే పాలాభిషేకం చేస్తామన్నారు.

తెలంగాణ దేశంలోనే అన్నీ రంగాల్లో అగ్రామిగా ఉన్నదని, బీజేపి నాయకులు నోరు పారేసుకోవడం తప్ప అస్సలు విషయం మాట్లాడారని వెల్లడించారు. బీజేపి డబుల్ ఇంజన్ గ్రోత్ ఎక్కడకి పోయిందని, ఎక్కడ కూడా అభివృద్ధి లేదని, తెలంగాణ యువత ఆలోచించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర బీజేపి నాయకులు దమ్ముంటే తెలంగాణలోని 23 జిల్లాలకు రావాల్సిన నవదయ స్కూల్స్ తేవాలని డిమాండ్ చేశారు. సిద్ధిపేట గ్రంథాలయంలో జాబ్ స్పేస్ యాప్ ద్వారా ఎక్కడ ఉద్యోగాలు ఖాళీగా ఉన్న మెసేజ్- సందేశం ద్వారా తెలుస్తుందని మంత్రి హరీష్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

- Advertisement -