మొసలి క‌న్నీళ్లు ఆపండి.. రాహుల్‌ గాంధీపై మంత్రి హ‌రీష్‌ ఆగ్రహం..

111
- Advertisement -

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై రాష్ట్ర ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖ‌ల మంత్రి హ‌రీష్‌ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ధాన్యం సేక‌ర‌ణ విష‌యంలో టీఆర్ఎస్ పార్టీ త‌మ నైతిక బాధ్య‌త‌ను విస్మ‌రిస్తుందని రాహుల్ చేసిన ట్వీట్‌పై హ‌రీష్‌ రావు ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్‌ చేశారు.

తెలంగాణపై దొంగ ప్రేమ, మొసలి క‌న్నీళ్లు ఆపండి రాహుల్‌ గాంధీ గారు.. తెలంగాణ ప్రజల మేలు కోరుకునేవాళ్లే అయితే పార్లమెంట్‌లో మా ఎంపీ లతో కలిసి మీరు ఆందోళన చేయండి.. రైతుల ఉసురుపోసుకుంటోన్న కేంద్రం తీరును ఎండగట్టే పని చేయండి అని తెలిపారు. ఒకే దేశం – ఒకే సేక‌ర‌ణ‌పై మీ పార్టీ స్టాండ్‌ ఎంటో ముందు చెప్పండి.. రైతుల విషయంలో కూడా రాజకీయాలు చేసి తెలంగాణ సమాజంలో మీ పరువును తీసుకోకండి అంటూ మంత్రి హరీష్‌ హితవు పలికారు.

- Advertisement -