విజయ్‌తో పూరి ‘జనగణమన’ షురూ..

93
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మరొక్క సారి కలిసి పని చేయనున్నారు. ఈ కొంబోలో ఆల్రెడీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపు దిద్దుకున్న క్రేజీ మూవీ “లైగర్” ఆగష్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో వీరి కలయికలో మరో చిత్రాన్ని ప్రకటించారు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్‌ పోస్ట్‌ర్‌ను రిలీజ్‌ చేశారు.

పూరి జగన్నాథ్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘జనగణమన’ విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కించబోతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా చిత్రం బృందం పోస్టర్‌ను విడుదల చేశారు. మోషన్‌ పోస్టర్‌లో భారత చిత్ర పటంతోపాటు, భారత సైనికులు కొందరు కనిపించారు. ఇక పూరి కనెక్ట్స్‌, శ్రీకర స్టూడియో పతాకాలపై దర్శకుడు వంశీ పైడిపల్లి, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్ట్‌ 3, 2023న సినిమాను విడుదల చేయనున్నట్లు పోస్టర్‌ ద్వారా తెలిపారు.

- Advertisement -