ఉద్యమ స్ఫూర్తితో జనతా కర్ఫ్యూః మంత్రి హరీశ్ రావు

347
harish rao
- Advertisement -

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో జనతా కర్ఫ్యూ నిర్వహిద్దామని పిలుపునిచ్చారు రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు 24గంటల కర్ఫ్యూకి సహకరించాలని కోరారు. కరోనాను జయించడంలో రాష్ట్రం.. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేలా కృషి చేయాలని ప్రజలనుద్దేశించి మంత్రి అన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్లు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని కోరారు.

చికిత్స కన్నా నివారణే మేలని మంత్రి తెలిపారు. స్వీయ నియంత్రణతోనే ఈ మహమ్మారి వైరస్‌ను అడ్డుకోవచ్చని వెల్లడించారు. 24గంటల పాటు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని చెప్పారు. ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలని చెప్పారు. దగ్గు, జలుబు లక్షణాలు కనిపిస్తే అలక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని మంత్రి సూచించారు.

- Advertisement -