ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన 30రోజుల ప్రణాళిక కార్యక్రమంలో వల్ల గత ప్రభుత్వాలు పాలించిన 70ఏళ్ల దరిద్రం పోయిందన్నారు మంత్రి హరీశ్ రావు. రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాను అన్నీ రంగాల్లో ముందంజలో ఉంచుకున్నాం అని అన్నారు . సిద్దిపేట పట్టణం లో పల్లె ప్రగతి ముప్పై రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక స్ఫూర్తి కొనసాగింపు పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, ఒడితేల సతీశ్ కుమార్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, జడ్పి చైర్ పర్సన్ రోజా శర్మ, వివిధ కార్పొరేషన్ ల చైర్మన్లు పలు శాఖల జిల్లా అధికారులు, జిల్లా సర్పంచ్ లు ఎంపిటిసి లు, జడ్పిటిసి లు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గోన్నారు.
ఈసందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. భవిష్యత్తులో కూడా సిద్దిపేట జిల్లాను ముందంజ ఉంచుకుందాము. చాలా గ్రామాలు శ్రమదానంను ప్రతిరోజూ కొనసాగిస్తున్నారు. మాల్కపూర్ గ్రామస్థులు 214 వారాలు శ్రమదానం నిర్వహించి డిల్లీలో జాతీయస్థయిలో అవార్డ్ పొందారు. తుప్రాన్ మండలంలో 10 గ్రామాలు ప్రతిరోజూ శ్రమదానం నిర్వహిస్తున్నారు. దుబ్బాక మండలం నర్సరీల నిర్వహణలో మొదటి స్థానంలో ఉందన్నారు. జిల్లాలో 499 గ్రామాలకు 486 గ్రామాలు నర్సరీలు పనులు ప్రారభమయ్యాయి, కేవలం 13 గ్రామాల్లో ఇంతవరకు నర్సరీల కోసం స్థల సేకరణ చేయలేదని చెప్పారు. ప్రతి గ్రామంలో ప్రతి శుక్రవారం డ్రై డే గా పాటించాలి.ప్రతి గ్రామాన్ని గాంధీజీ కళలు కన్న గ్రామ స్వరాజ్యం తయారు చేయాలన్నారు. సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలోని పారిశుధ్య కార్మికుల కోసం 15 రోజుల్లో ప్రమాద బీమా చేయించాలి. జనాబా ప్రాతిపదికన ప్రతి గ్రామానికి, ట్రాక్టర్ ట్రాలీ, ట్యాంకర్, ప్రంట్ బ్లేడ్ పంపిణీ చేస్తామని తెలిపారు.