చెక్ డ్యాంల నిర్మాణంపై మంత్రి హరీష్‌ సమీక్ష..

296
- Advertisement -

సంగారెడ్డి జిల్లా పన్యాల గ్రామంలో మంజీర నదిపై చెక్ డ్యాంల నిర్మాణంపై మెదక్,సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో కలసి ఇరిగేషన్, రోడ్ భవనాల శాఖ అధికారులలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. ఈ సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, క్రాంతి కిరణ్‌లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. చెక్ డ్యాం నిర్మాణంలో పెండింగ్ పనులన్ని త్వరగా పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించిన మంత్రి హరీష్ రావు. చెక్ డ్యాంలు సంగారెడ్డి నియోజకవర్గంలో 2, నర్సాపూర్ నియోజకవర్గంలో 11 నిర్మాణం చేస్తున్నాము.

నర్సాపూర్ నియోజకవర్గంలోని నిర్మాణ పనులు పూర్తి కావాలని గుతేదర్‌కు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. మిగిలిన పనులు 40 రోజులలో పూర్తి చేయాలని ఆదేశించారు.నెల రోజులకి మరో సారి సమీక్షా సమావేశం తీసుకుంటాను. సంగారెడ్డికి చెందిన చెక్ డ్యాం 2లో ఒకటి పసాల్ వది పూర్తి కాగా వెండికోల్ పనులు పూర్తి చేయాలని మంత్రి హరీష్‌ రావు అధికారులను ఆదేశించారు.

- Advertisement -