సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు..

405
Donations For CM Relief Fund Telangana
- Advertisement -

ఈరోజు ముఖ్యమంత్రి సహాయనిధి మంత్రి కే తారకరామారావు కార్యాలయం ద్వారా అందిన విరాలల వివరాలు. ఈ రోజు మొత్తం 15 మంది మంత్రి కే తారకరామారావు ద్వారా సుమారు రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలను సీఎంఆర్ఎఫ్ కి అందించారు. నార్నే ఏ స్టేట్స్ సీఈఓ గోకుల్ దాన్ని యాభై లక్షల రూపాయల చెక్కును మంత్రి కేటీఆర్ అందించారు.

స్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా ఫౌండేషన్ 25 లక్షల రూపాయలను, రానే లిమిటెడ్ రానే బ్రేక్ లైనింగ్ లిమిటెడ్ రెండు కలిపి 30 లక్షల రూపాయలను, నెక్టర్ తేరపూటిక్స్ 15 లక్షల రూపాయలను, తెలంగాణ రికగ్నైస్ డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తరఫున కందాల పాపిరెడ్డి 11 లక్షల రూపాయలను, తెలంగాణ స్టేట్ బీడీ లీవ్స్ ఫారెస్ట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఎనిమిది లక్షల రూపాయలను, ఫతే మైదాన్ క్లబ్ ఆరు లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు.

సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ, రక్షిత్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సైనర్ లేబరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, స్వామి వివేకానంద సేవా సమితి 5 లక్షల చొప్పున విరాళాలను ముఖ్యమంత్రి సహాయనిధి అందించారు.

- Advertisement -