ఇవి చరిత్రాత్మక సమావేశాలు- హరీష్ రావు

173
Minister Harish Rao press meet
- Advertisement -

శాసనసభలో 11 బిల్లులను ఆమోదించుకున్నామన్నారు మంత్రి హరీష్‌రావు. టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష కార్యాలయంలో జరిగిన ప్రెస్‌ మీట్‌ లో ఈ విషయాన్ని వెల్లడించిన ఆయన.. శాసనసభలో సంపూర్ణమైన చర్చ జరిగిందని, ఎన్నో ఏండ్లుగా నిరీక్షణతో చూస్తున్న అసైన్డ్ భూముల బిల్లుతో పాటు దాదాపు అన్ని డిమాండ్లను ఆమోదించుకోగలిగామని చెప్పారు.

అలాగే..గిరిజనులకు ప్రత్యేక హాక్కులు కలిగించిన చరిత్రాత్మక సమావేశాలుగా వీటిని చెప్పుకోవచ్చన్నారు హరీష్‌ రావు. పంచాయతీరాజ్ చట్టం బిల్లును ఆమోదించుకున్నామని, గిరిజనులకు హక్కులు, బాధ్యతలు, నిధులు కల్పించామని తెలిపారు. అంతేకాకుండా మన రాష్ట్ర డీజీపీని మనమే నియమించుకునే హక్కు కలిగే చట్టం బిల్లును ఆమోదించకున్నామని వెల్లడించారు.

కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకం కింద రూ.1,00,116 చెల్లింపు, గీతకార్మికుల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటనలు చేశారన్నారు.

- Advertisement -