రోశయ్య పార్థీవ దేహానికి మంత్రి హరీష్‌ నివాళి..

167
- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య శనివారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల రాష్ట్ర మంత్రి హరీష్‌ రావు విచారం వ్యక్తం చేశారు. రోశయ్య పార్థీవ దేహాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా అనేక పదవులు అలంకరించి, అమూల్యమైన సేవలు అందించారు.

వివాదరహితుడిగా అందరి మన్ననలు పొందిన అరుదైన నాయకులు కొణిజేటి రోశయ్య మృతి బాధను కలిగించిందని.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని మనసారా ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని మంత్రి అన్నారు.

- Advertisement -