బీపీని,షుగర్ని ముందుగా గుర్తించి జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందన్నారు మంత్రి హరీష్ రావు. హైపర్ టెన్షన్ డే సందర్భంగా దీనిపై అవగాహన కల్పించడం కోసం ఒక్క రోజును జరుపుకుంటామన్నారు. సి ఎస్ ఐ ఇచ్చిన సర్వే ఫలితాలు కొంత ఆశ్చర్యం ,బాధను కల్గిస్తున్నాయి అన్నారు.
నిమ్స్ లో ఒక్క సర్వే చేశాం…ఎవరికైతే కిడ్నీ సమస్యలు ఉన్నాయో వారిలో 60 శాతం మందికి హైపర్ టెన్షన్ ఉందన్నారు. బిపి ని ,షుగర్ ని ముందుగా గుర్తించి జాగ్రత తీసుకోకపోతే వ్యాధి ప్రాణతకంగా మారుతుందని…లైఫ్ స్టైల్స్ మార్పులు వలన ఈ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ప్రజలు తమ ఆరోగ్యం పట్టించుకోకుండా తీవ్రమైన ఒత్తిడికి గురివుతున్నారని…ఇంతకు ముందు శారీరకంగా శ్రమ ఉంటుండే ఇప్పుడు నో ఫిట్నెస్ అన్నారు.
ఆహారం అలవాట్లు బాగా మారిపోయాయని..తెలంగాణ ప్రభుత్వం ఈ సమస్యని గుర్తించి ఎన్ సి డి స్క్రీనింగ్ చేస్తున్నాం అన్నారు. 90 లక్షలు మందికి స్క్రీనింగ్ చేస్తే , తమ స్క్రీనింగ్ లో 13 లక్షలు మందికి హైపర్ టెన్షన్ ఉందని తెలిపారు. వచ్చే 2,3 నెలలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి బిపి,షుగర్ టెస్ట్ లు చేయాలని నిర్ణయచుకున్నాం, 33 కోట్ల రూపాయలు కూడా నిధులు కెటయించుకున్నామన్నారు.
మూడు రకాలు మందులు ఇస్తున్నాం…మందులు వాడుతున్నారా లేదా అని తెలుసుకోవడం కోసం కాల్ సెంటర్ పెట్టినం అన్నారు. రెగ్యులర్ గా చెక్ అప్ చేస్తాం..ఇండియా లో ఎన్ సి డి స్క్రీనింగ్ లో 3వ స్థానంలో ఉన్నాం అన్నారు. రానున్న 3,4 నెలలు మొత్తం గా పూర్తి చేసి దేశంలోనే మొదటి స్థానంలోకి వస్తాం అన్నారు. ఆయుష్ ద్వారా యోగ చేసే విధముగా 450 సెంటర్ల ద్వారా ట్రైనింగ్ ఇవ్వనున్నాం అని తెలిపారు.
చిన్న పిల్లలకు కూడా కిడ్నీ సమస్యలు ఉన్నాయి..హైద్రాబాద్ నగరం మొత్తం సర్వే చేస్తాం అన్నారు. 350 బస్తి ధవాఖాన్ ల ద్వారా 57 టెస్ట్ లు చేస్తున్నాం అని తెలిపిన హరీష్..వచ్చే నెల నుంచి 120 టెస్ట్లు చేయనున్నారు. 45 సంవత్సరాలు దాటినా వారిలో బిపి ,సుగర్ టెస్టులను చేయించుకోవాలని కోరారు హరీష్.