కరోనాతో ఆందోళన వద్దు- మంత్రి హరీష్

495
harish
- Advertisement -

సంగారెడ్డి జిల్లాలో ఆరు కరోనా పాసిటివ్ కేసులు వచ్చిన నేపథ్యంలో సంగారెడ్డి కలెక్టరేట్‌లో మంత్రి హరీష్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ హనుమంత రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరిష్ రావు మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లాలో ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. ప్రైమరి కాంటాక్ట్ కింద ఆరుగురి కుటుంబ సభ్యులలో 42 మంది ని క్వారైంటైన్ కి పంపాం. సెకండరి కాంటాక్ట్ వివరాలు సెకరిస్తున్నారు. వారిని హోమ్ క్వారైంటైన్ చెస్తున్నామన్నారు.

ఆరుగురి ఇండ్ల వద్ద కిలోమీటర్ మేర 42 మెడికల్ టీమ్స్ వెళ్లి అవగాహాణ కల్పిస్తారు. నాలుగు ప్రాంతాల్లో నలుగురు జిల్లా అధికారులు పర్యవేక్షిస్తారు.కరోనా తో ఆందోళన వద్దు. మైనార్టి ప్రాంతాలలో ఎక్కువ వస్తున్నందున్న జాగ్రత్తగా ఉండాలి. నెగిటివ్ గా తిసుకోవద్దు. హదిస్ లో కుడా చెప్పారు. వ్యాదులు ప్రభులుతున్న సమయంలో ఎక్కడివారు అక్కడే ఉండండని చెప్పారు. హదిస్ పంక్తులను ఉర్దులో చదివి
వినిపించారు హరిష్ రావు.

ప్రభుత్వం మిమ్మల్ని కాపడడానికి చర్యలు తిసుకుంటుంది. వైద్య సిబ్బందంకి సహకరించండి. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వెయండి. పాజిటివ్ వచ్చిన ప్రాంతాల్లో ఈ రోజు సాయంత్రం నుండే డ్రోన్,ఫైర్ ఇంజన్ ల ద్వారా మందులను పిచికారి చెస్తారు అని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చెస్తున్నారు. ప్రైమరి కాంటాక్ట్ కెసుల కోసం క్వారైంటైన్ ఎర్పాటు చెసాం..అధికారులు ఎప్పటికప్పుడు ఆరుగురి కుటుంబాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఇంకా ప్రైమరి కాంటాక్ట్స్ రిపోర్ట్స్ రావాల్సి ఉంది. పాజిటివ్ వచ్చిన కుటుంబాల ప్రాంతాల్లో ఎక్కువ నిఘా ఉంచుతున్నాం అని హరీష్‌ అన్నారు.

- Advertisement -