మన ఇంట్లో మనం ఉందాం..కరోనా ను ఖతం చేద్దాం అన్నారు రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావు. ఈ మాయదారి కరోనా నుంచి మన కుటుంబాన్ని, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు. జనతా కర్ఫ్యూ లో భాగంగా సిద్దిపేటలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో గడిపారు మంత్రి హరీశ్ రావు. ఈసందర్భంగా మంత్రి హరీశ్ రావు రాష్ట్ర ప్రజలకు సందేశం ఇచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు జనతా కర్ఫ్యూలో భాగంగా నేను మా కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే ఉన్నట్లు తెలిపారు. పోలీసులు ,మిలటరీ వాళ్ళు పెట్టిన దానికన్నా ప్రజలు స్వచ్చందంగా ఈ కర్వ్యూ ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బయట తిరిగితే ఏం కాదనే దోరణి వద్దు అలాంటి ధోరణి వల్లే చైనా, ఇటలీ లాంటి దేశాలు ఎంత నష్టపోయారో మనం చూస్తున్నట్లు వెల్లడించారు. అలాంటి విపత్కర పరిస్థితులు మనకు రాకుండా ఉండాలంటే మనం మన ఇంట్లోనే ఉందాం అని పిలుపునిచ్చారు.
కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూ ను ప్రకటించారు. ఈరోజు ఉదయం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు కర్ఫ్యూ పాటించాలని విజ్నప్తి చేశారు. ఈ మేరకు జనతా కర్ప్యూ లో ప్రజలు స్వచ్చందంగా పాల్గోన్నారు. దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీ పిలుపుకు అద్భుతమైన స్పందన వస్తోంది. ఇక తెలంగాణలో 24గంటల పాటు జనతా కర్ఫ్యూ విధించారు సీఎం కేసీఆర్.