బుధవారం నాడు సిద్దిపేట జిల్లా, నంగునూరు మండలం, నర్మెట్ట గ్రామంలో 300 కోట్ల రూపాయలతో 60 ఎకరాలలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి రాష్ట్ర మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, సహకార మరియు ఉద్యానవనశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణా రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఇవాళ ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ సిద్దిపేట జిల్లాలో ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో కానే కాదు, నీళ్లు రానే రావు అని కాంగ్రెస్, బీజేపీ వాళ్లు మాట్లాడారు. కేసీఆర్ అపర భగీరథ ప్రయత్నంతో కాళేశ్వరం నీరు తెచ్చుకున్నం. కిరణ్ కుమార్ రెడ్డి మీకు చీకటే కరెంటు ఎక్కడ అన్నరు. ఏపీలో చీకటి ఉంది కాని తెలంగాణలో 24 గంటల కరెంటు ఇచ్చి చూపిండు కేసీఆర్. ఇంట్లో నుండి రైతు బయట కాలు పెట్టకుండా ఎకరానికి పది వేల రూపాయలు పెట్టుబడి ఇచ్చిండు కేసీఆర్ అని మంత్రి తెలిపారు.
వ్యవసాయం చేసే రైతులు నాలుగు డబ్బులు సంపాదిస్తే ఆనందం. రైతులు వరి వరి అని ఒకటే పంట వేస్తున్నరు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో రైతే రాజు కావలన్నది కేసీఆర్ కల. వరి వేస్తే 20 లేదా 25 వేలు మిగులుతుంది. కాని రైతు ఆదాయం పెరగాలాన్నది మా తన్నులాట. అందు కోసమే ఆయిల్ పామ్‌ను మంత్రి నిరంజన్ రెడ్డి సహకారంతో ఆయిల్ పామ్ జిల్లాగా డిక్లేర్ చేయించినం. ఎకరానికి 80 వేల రూపాయల సబ్సిడీ ఇస్తున్నం. డ్రిప్ కంపెనీలకు సబ్సిడీ పెంచినం అన్నారు.
ఖమ్మం జిల్లాకు చాలా మందిని పంపిన. కళ్లతో చూసి వచ్చిండ్రు. తెలంగాణ వచ్చాక మొట్ట మొదటి పామాయిల్ ఫ్యాక్టరీ సిద్దిపేటలో పెడుతున్నం. కోతులు, పందులు, చీడ పీడ లేని పంట ఇది. ధర రాదనే బాధలేదు. ఎకరానికి తక్కువలో తక్కువ లక్షా 50 వేల రూాపాయలు నికరంగా లాభం వస్తుంది. పంట కొనేది ఆయిల్ ఫెడ్ ప్రభుత్వ సంస్థ. ఫ్యాక్టరీ మన జిల్లాలోనే ఉంది. గవర్నమెంట్ ఉద్యోగికి జీతం ఎంత వస్తదో.. ఆయిల్ పామ్ రైతుకు అంతే వస్తది. భారత దేశం లక్ష కోట్ల రూపాయల పామాయిల్ ను దిగుమతి చేసుకుంటుంది. మన దేశంలో పండకనే పక్క దేశం నుండి తెచ్చుకుంటున్నాం. నూనే పంటల సాగు మన దేశంలో తక్కువ. పామాయిల్ కుమంచి డిమాండ్ ఉంటది. రైతులు పంటలు వేస్త బాగుపడతరు. జులై నెల కల్లా 20 వేల ఎకరాలకు మొక్కలు రడీగా ఉన్నాయి. ఇప్పటికే 3 వేల ఎకరాల్లో పంట వేశారు. ప్రజాప్రతినిధులు ప్రతీ మండంలో పెద్ద ఎత్తున పామాయిల్ తోటలు పెట్టేలా చర్య తీసుకోవాలని మంత్రి సూచించారు.
ఢిల్లీ కేంద్రం తొండాట ఆడుతుంది. యాసంగి పంట అంటేనే బాయిల్డ్ రైస్. రా రైస్ పట్టిస్తే నూకలు ఎక్కువ..బియ్యం తక్కువ. పండేది బాయిల్డ్ రైస్ ఇస్తమంటే రా రైస్ అంటరు. కొంటమని చెబుతరు…బాయిల్డ్ రైస్ కొన అంటరు. నోటితో చెప్పి నొసటితో ఎక్కిరించినట్లుంది కేంద్ర వ్యవహారం.నూకలు ఎంత ఖర్చు అయితే అంత 2 వేల కోట్లా, 3 వేల కోట్లా ఆ నష్టం మనం భరిద్దాం, రైతును నిలబెడాం అని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నరు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సమస్య సృష్టిస్తున్నరు. తెలంగాణ పట్ల వాళ్ల కళ్లు మండుతున్నయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నింట్లో నెంబర్ వన్. తలసరి ఆదయంలో, ఆర్థిక వృద్ది రేటులో నెంబర్ వన్. 24 గంటల ఉచిత విద్యుత్తు ఇ్వవడంలో నెంబర్ వన్, రైతుకు ఎకరానికి పది వేల ఇవ్వడంలో నెంబర్ వన్, రైతు చనిపోతే 5 లక్షల భీమా ఇవ్వడంలో నెంబర్ వన్. అత్యధిక వరి ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పేర్కొన్నారు.
ఢిల్లీలోని బీజేపీ నేతలకు ఎమని తిట్టాలో అర్థం కావడం లేదు.బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ అన్నింట్లో నెంబర్ వన్. ఈర్ష్యతో, అభివృద్ధిని చూసి ఓర్వలేక కేంద్రం కుట్రలు చేస్తోంది. అందులో ఒకటి. వడ్లు కొనం. అని రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నరు. రాష్ట్రంలో అశాంతి రావాలి. రైతుల్లో అశాంతి రావాలి. తక్కువ ధరకు రైతులు అమ్ముకుని నష్టపోవాలి. బీఆర్జీఎప్ లో 1350 కోట్లు ఇవ్వాలి. 50 సార్లు దరఖాస్తు పెట్టినం. అవి ఇవ్వడం ఆపేశారు. 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు ఇ్వవాలంటే ఇవ్వలేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నరు. అప్పులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నరు. బాయిల కాడ మీటర్లు పెడితే 25 వేల కోట్లు అప్పు ఇస్తమంటరు. సీఎం మీటరు బాయిల కాడ పెట్టేది లేదని చెప్పారు. ఇవన్నీ మీ దృష్టిలో పెట్టుకోవాలి. రైతుల సంక్షేమం కోసం పని చేస్తున్న ప్రభుత్వం మాది అని మంత్రి వివరించారు.
రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట రెడ్డి వంటి వాళ్లు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. మీ పాలనలో ఒక్క మడి ఎండకుండా పంట పండందా. కరెంటు కోతలు, కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లు,నెర్రలు బాసిన నెలలు. ఇంకా కలలు కంటున్నరు కాంగ్రెస్ నేతలు. దేశంలో ఉన్న సీట్లే పోతున్నయి. మీ సంసారం చక్కగ లేదు.. మీ కాంగ్రెస్ పార్టీ చక్కగ లేదు. మీరు అధికారంలోకి వస్తరంట అని మంత్రి ఎద్దేవ చేశారు. 200 పెన్షన్ మీరు ఇస్తే కేసీఆర్ 2000 ఇస్తున్నరు. ఆరు గంటల కరెంటు ఇస్తే, 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తుంది తెరాస ప్రభుత్వం. మీకు ఏం చూసి ఓటయ్యేలా.. కాంగ్రెస్ అంటే చరిత్ర కోసం మాట్లాడలి తప్ప భవిష్యత్తు లేని పార్టీ. కాంగ్రెస్ వి పగట కలలు అన్నారు.
రైతులకు టీఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. అందుకే కేసీఆర్ రైతు నష్టపోవద్దని 2 వేల కోట్ల అయినా నూకల నష్టం భరిస్తామని ప్రకటించారు. యాసంగి పంట ముగియగానే, వానాకాలంలో 20 వేల ఎకరాల్లో పామాయిల్ పంట వేసేందుకు ముందుకు రండి. సత్తుపల్లి వెళ్లి చూసి వస్తానంటే రైతులను పంపుతాం అన్నారు. అప్పులు పోయి, ఇళ్లు కట్టుకుని, పిల్లలను చదివించుకోవలనే ఉండాలనే నా తాపత్రయం. బీజేపీ వాళ్లు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తమన్నరు. చేసిండ్రా.. డిజీల్ ధర డబులు, ఎరువుల ధరలు డబులు చేసి ఖర్చు పెంచారు. బీజేపీ రాక ముందు 2 వేలు ట్రాక్టర్ ఖర్చు అది ఇప్పుడు 5 వేలయింది. ఎరువులు పోటాష్ 1700 అయింది. డీఏపీ పెరిగింది. బీజేపీ మాటలు చెప్పింది తప్ప..చేతల్లో చేయలేదు . బీజేపీకి గుణ పాఠం తప్పుదు అన్నారు.సిద్దిపేట ఉద్యమంలో ముందుంది. అభివృద్ధిలో ముందుంది. పామాయిల్ తోటల్లో కూడా ముందుంటుంది అని మంత్రి తెలిపారు.